Sri Bhavanarayana swamy temple
Telugu: One of the oldest temples in Guntur District. It’s Gopuram was built from a single rock. It is believed to be 1500 year old, and some of the inscriptions on the wall are in Telugu script which was still evolving at that time. Chariot festival in summer used to be lot of fun and common people can participate by pulling the Lord’s Chariot up to Anjaneyaswamy temple and back.
It is still a fact that many people(saints, seekers, sadhakas, devotees and common people) feel some unknown power, calmness, peace in the temple.
కోటీరామలమందరాచలధరం సర్లంధరం సుందరం
మందస్మేరసుధామనోజ్ఞ వదనం మార్తాండలోటిప్రభం
శ్రీమద్బావపురీశమీశ మనిశం శ్రీ భావనారాయణం||
మద్య యుగ చరిత్ర, సంస్కృతుల అద్యయనానికి దేవాలయాలే ప్రధన కేంద్రాలు. భారతీయ సంస్కృతికి జీవగఱ్ఱలైన
దేవాలయాల నిర్మాణాలకు వాడిన శిలలు ఆ శిలలపై చెక్కబడిన శిల్పాలు, లిఖించబడిన శాసనాలు చారిత్రక పరిశోధనకు ఎంతగానో దోహదపడుతున్నయి. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్న నానుడిలొ ఎంత వాస్తవమున్న ఆ రాళ్ళే శాసనాలుగ మనకు ఆనాటి చారిత్రకాంశాలను తెలియజేసే ప్రధనాంశాలు కావడం మన అదృష్టం. చరిత్ర మనకు వారసత్వంగా అందజేస్తున్న ఈ శిలా సంపద ద్వారా అనేక గ్రామ ఆవిర్భావాల చరిత్ర మనకు వెల్లడవుతున్నది ఆ కోవలోనే మద్య యుగం నుండి నేటికి భక్తులను ఆకర్షిస్తూ గొప్ప ఆరాధనా కేంద్రంగా విలసిల్లుతున్న బాపట్ల శ్రీ భావనారాయయ స్వామి దేవాలయం కూడా బాపట్ల గ్రామ ఆవిర్భావానికి అంకురార్పణ చేసిన క్షేత్రంగా చరిత్ర కెక్కింది. తీరాంధ్రలోని తొలి వైష్ణవాలయం ఇదే. వెలనాటి సీమలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఈ వైష్ణ్వ క్షేత్రం బాపట్ల చరిత్ర సంస్కృతి, శతాబ్దాల సామాజిక వ్యవస్దలను వెల్లడించే ఆద్యాత్మిక కేంద్రమై 1417 సంవర్సరాలుగా తనలో ఇముడ్చుకున్న అనేక జ్ఞాపకాలను శిలా శాసనాల రూపంలో మనకు అందిస్తొంది. అలనాటి తన ప్రాభవాన్ని నేటికీ కోల్పోకుండా వైభవోపేతంగా విరాజిల్లుతోంది .
స్దలపురాణము
ఈనాటి పురాతన దేవాలయాన్ని వేదకాలం నాటి యాగశాలలే భావనారాయణ స్వామి ఆలయం కృత యుగంలో బ్రహ్మరణ్యమనీ, ఇక్కడ విష్ణుమూర్తి గురుంచి బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడనీ, కృత, త్రేత, మరియు ద్వాపర యుగాలలో బ్రహమర్షులు ఇక్కడ యాగకుండాలను ఏర్పాటుచేసి శ్రీమహావిస్ణువు సాక్షా త్కారానికై ప్రశస్త ద్రవ్యములతో హోమం నిర్వహిస్తుండేవారనీ,
అప్పుడు నారాయణుడు వేవ్వేరు యుగధర్మాలను అనుసరంచి, ఆయా యుగాలకు చెందిన రూపాలతో వారికి దర్శనమిచ్చేవాడని వివరించబడింది. అంతేకాకుండా ఆ యాగ గుండములో ఒక క్షీర వృక్షం మొలిచిందనీ, మొలిచినా క్షీరవృక్షంలోనే బ్రహ్మర్షులు,ఆరాదించిన శ్రీమన్నరాయణుడు నిగూఢంగా ఉండిపోయాడనీ మహామహిమాన్వితమైన ఈ పుణ్య క్షేత్రమందు కలియుగంలో స్వామి వారు స్వయంవ్యక్తమయ్యారనీ స్దల పురాణం చెబుతున్నది
బాపట్ల ఆవిర్భావ చరిత్ర - కైఫియత్తులోని వివరణ
ప్రతి గ్రామ చరిత్రను గ్రంధ రూపాన నిక్షిప్తం చేయడం ద్వార గ్రామ ఆవిర్భావాలను, ఆ సందర్భంగా జరిగిన పలు సామాజిక సంఘటనలను భావితరాలకు తెలియజేసే సంకల్పంతో కల్నల్ మెకంజి మెకంజీ [1757-1821] గ్రామ చరిత్రల రచనలకు శ్రీకారం చుట్టాడు. ఈ గ్రామ చరిత్రలనే కైఫియత్తులు అంటారు. నాటి ఆమ కరణాలను, స్దానిక రాజకీయ సేవకులను, విశ్లేషకులను ఈ బృహత్కార్య నిమిత్తం మెకంజీ నియోఅగించాడు. ఒక్కోగ్రమ చరిత్రకు ఒకూఅ కైఫియత్తును రూపొందిచాడు. ఆవిధంగా రూపొందించబడ్డ బాపట్ల కైఫియత్తులో బాపట్ల ఆవిర్భావ చరిత్ర ఈ క్రింది విధంగా వివరించబడింది.
బాపట్ల సమీప గ్రామమైన కొండపాటూరు నుండి ఒకనాడు బావ-బావమరుదులు ఇద్దరు కట్టెలు కొట్టుకోవడానికి ప్రస్తుత భవనారాయణ స్వామి దేవస్దానమున్న ప్రామ్రానికి వచ్చారు అది అప్పట్లో పూర్తిగా అటవీ ప్రాతం అక్కడ మామూలు వృక్షాలతోపాటు శాఖోపశాఖలుగా విస్తరించి వున్న అనేక క్షీర వృక్షాలు [పాలచెట్లు] కూడా ఉన్నాయి. ఇద్దరు చెరో దిక్కుకెళ్ళి చెట్లుకొట్టడం ఆరంభించారు. అందులో "బావ" ఒక క్షీర వృక్షం మీద వేసిన గొడ్డలి వేటుకు ఆ చెట్టు నుంచి అనూహ్యంగా రక్తం స్రవించడంతో ఆ రక్తాన్ని చూఅసిన అతను భయోత్పాతంతో మూర్చిల్లాడు. వేరే దిక్కున చెట్టు కొట్టందుకు వెళ్ళిన బావమరిది తన పని పూర్తి కాగానే బానను వెదుకుతూ "బావ" అని పివగా ఒక పాల చెట్టు నుంచి "ఓయ్" అని స్వరం వినపడడంతో అతను ఆ దిక్కుకు వెళ్ళి అక్కడ రక్తం స్రవిస్తున్న చెట్టును, దాని చెంతనీ స్పృహతప్పి పడున్న తన బావను చూసి కంగారుగా మళ్ళీ "బావా" అని పిలిచాడు. మరలా అదే చెట్టు నుంచి వచ్చిన ఆ సమాధానానికి ఆశ్చర్యచకితుడయ్యాడతను. అది దై వ మాయగా భావించిన అతను క్షణంలో జరిగిన తప్పును గ్రహించాడు. ఆవెంటనే తమ తప్పును మన్నించమనీ, తమని మన్నించి కరుణిస్తే పొంగళ్ళు పెట్టుకుంటామనీ ఆ చెట్టునే ప్రార్దించడంతో అతని బావ తిరిగి స్పృహలోకి వచాడు. దాంతో ఆ చెట్టుగల గల ప్రాంతం మహిమలతో కూడుకున్నదని భావించిన ఆ ఇద్దరూ ఆనాటినుంచి ఆచెట్టును పూజించడం ప్రారంభించారు. అంతేకాకుండా తాము మొక్కుకున్న విధంగా ప్రతి ఆదివారం నాడు వారు ఆ వృక్షానికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నమర్పించసాగారు.
ఇదిలా వుండగా వీరప్రతాప క్రికంఠ చోళుడు పనే చోళ రాజు తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా క్రీ.శ. 6వ శతాబ్దం చివరి భాగంలో కావేరి నదీ తీరం నుండి దిగ్విజయ యాత్రకై బయల్దేరి, సమస్త రాజులను జయించి తిరిగివెళ్తూ,విశ్రాంతి నిమిత్తం "ఆముదాలపల్లి" గ్రామం వద్ద త సైన్యంతో మజిలీ చేశాడు. రాజు, ఆయన పరివారం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలొ ఆరాజుగారి పట్టపుటేనుగులు తమ అహారం నిమిత్తం ఆ ప్రాంతమంతా వచ్చాయి. ఆ ప్రాంతంలోని క్షీర వృక్షాలను చూడగానే వాటికి ఆకలి రిట్టింపై వెంటనే ఒక క్షీర వృక్షాన్ని తమ తొండములతో విరచి తినడానికి ప్రయత్నంచాయి. అయితే విచిత్రంగా ఆ ఏనుగుల తొండములు ఆ పాలచెట్టుకు అతుక్కునిపోవడంతో భీతిల్లిన మావంటివాడు పరుగు పరుగున మహరాజు దగ్గరకు వెళ్ళి ఆ సంఘటనను వివరించాడు . ఆ వార్త ఎంతో చిత్రంగా అనిపించడంతో వెంటనే చక్రవర్తి తనే స్యయంగా తన పరివారంతో సహా ఆ చెట్టు దగ్గరకు చేరి దానికి అతుక్కునిపోయిన తన పట్టపుటేనుగులను చూసి మరింత ఆశ్చర్యానికి గురయ్యాడు. అది భగవానుని లీలగా గ్రహించి, చేతులు జోడించి, ఆ వృక్షరాజంతో "ఓ క్షీర వృక్ష్మా! నీ మహిమ తెలియక తప్పు జరిగింది. నా నేరములు మన్నించి నా ఏనుగులను కాపాడుము" అని శరణు వేడడంతో వెంటనే స్వామి ఇద్దరు విప్రులలో ఆవహించి, "ఓ చోళ మహారాజా ! ఏనుగు పాదములవంటి స్తంభములతో విరాజిల్లు ఒక ఆలయమును ఈ ప్రాంతమున నిర్మించి నన్ను ప్రతిష్ఠింపుము, నా పీరుతో ఒక పట్టణమును నిర్మింపుము, అప్పుడు మేము ప్రసన్నులమవుతాము, అనడంతో దానికి చొళ మహారాజు మహదానందభరితుడై వెంటనే అంగీకరించాడు. వెంటనే ఆ ఏనుగులకు స్వస్దత చేకూరి అవి అక్కడినుంచి వెళ్ళిపోవడంతో స్వామివారి మహిమను అనుభవపూర్వకంగా గ్రహించిన అతను ఆముదాలపల్లిలోనే స్దిర నివాసమేర్పరచుకొని ఆలయ నిర్మాణానికి పూనుకొన్నాడు. ఇద్దరు విప్రుల ద్వారా తన భావాలను వ్యక్తం చేసిన నారాయణుడిని భావనారాయణుడన్న పేరుతో ప్రతిష్ఠింపదలచి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు ఆవెంటనే చిలకలూరిపేట నద్ద గల బొప్పూడి కొందనుండి రాళ్ళు తెప్పించి,పనులు ప్రారంభించాడు. రే నిర్మించిన ప్రతి కట్టడం మరునాటికే శిధిలమైపోతుండడంతో చక్రవర్తి మళ్ళీ దైవాన్ని ప్రార్దించాడు. అప్పుడు స్వామి చక్రవర్తికి స్వప్నంలొ సాక్షాత్కరించి "ఓ రాజా! వెంకతగిరి సంస్దానమునందు చిమ్మిరిబండయను కొండగలదు.
అందలి రాళ్ళు కృష్ణవర్ణమయములు. ఆ కొండయందలి రాళ్ళకు శీతాకాలమున వెచ్చదనమును, గ్రీష్మమున చల్లదనము నొసంగెడి లక్షణము కలదు. ఆ రాళ్ళ తో ఆలయ నిర్మాణమును చేయుము" అని పలకగా ఆ రాజు వెంకటగిరి రాజు గారి అనుమతితో ఆ సంస్దానమునందలి చిమ్మిరిబండ కొండనందలి రాళ్ళను ఏంతో వ్యయ ప్రయాసలకోర్చి తెప్పించి, ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు.
పునాదులు తవ్వుతుండగా ఆ త్రవ్వకంలో ఒక వల్మీకము [పుట్ట], అందులో శ్రీ వీరభొగ యోగ లక్ష్మీ సమేత జ్వాలా నరసిం హ స్వామి విగ్రహము బయటపడ్డాయి. హిరణ్య కశిపుని వధానంతరం శాంత రసనికి చేరుకుంటున్న జ్వాలా నరసిం హ స్వామి రూపమది. ఆ విగ్రహమును అక్కడినుంచి కదిలించటానికి సాధ్యం కాకపోవడంతో ఆ రాజు తూర్పుదిక్కున తిరుచుట్టు మాలిక వెడల్పు పెట్టించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించారు ఐతే పుట్టనుండి బయటపడ్డ జ్వాల నరసిం హ స్వామి వారిద్రుస్ఠి అక్కడికి ఆరుక్రోసుల దూరంలో గల కారంచేడు గ్రామంపై పడి ఆ ఊరు ధగ్ధ మవడంతో ఆ దోష నివారణకు శ్రీ శాంతకేశవ స్వామిని శ్రీ జ్వాలా నరసిం హ స్వామికి అభిముఖం గా ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేసాడు.
ఓ వంక దేవాలయ నిర్మణం చురుగ్గా సాగుతుండగా కొండపాటూరు గ్రామంలో ఓ క విచిత్రమైన సంఘటన జరిగింది ఆ గ్రామంలో ఓ క జున్న పాతర యందు అమ్మవారి విగ్రహము బయటపడింది ఆమె అక్కడి కాపులతో నేను శ్రీ భావన్నరాయన స్వామి వారి దేవేరిని నా పేరు రాజ్యలక్ష్మి నాకు ఈ ఊరే పుట్టినిల్లు మా అత్తగారి ఊరు భావపట్ల, పుట్టినింటివారే నాకు మంగలద్రవ్యములను ప్రతిసంవత్సరం కల్యాణోత్సవములో సమర్పించవలెను అని చెప్పడం తో గ్రామస్తులు వెంటనే చొళ మహారాజు కు ఆ సంఘటను తెలియజేసారు, మహారాజు ప్రమానందంతో గ్రామీణుల సహకారంతో కొండపాటూరు నుండి శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మి తాయారు విగ్రహాన్ని తెప్పించి శ్రీ భావన్నారాయన స్వామి వారికి వాయవ్య దిగ్భాగాన దక్షిణాముఖంగా ప్రతిష్ఠ చేయించి ఆ దేవేరి కి గజపాదాకార స్తంభాలతో నిర్మించి ఆలయంలోనే మరో ఆలయాన్ని నిర్మిచారు ( అది మొదలు నేటికి కూడా స్వామివారి కల్యాణమహోత్సవానికి కొండపాటూరు గ్రామమ్నుండి మంగలసూట్రం మెట్టెలు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ, తలంబ్రాలు వంటి మంగల ద్రవ్యాలు రావడం ఆచార మైఇంది ఓకప్పుడు ఈ మంగళ ద్రవ్యాలను గ్రామస్తులనుంచి గ్రామ కరణం సేకరించి తీసుకోచేవారు. ఇప్పుడు కొండపాటూరు గ్రమ పొలేరమ్మ దేవాలయం నుంచి గ్రామ పెద్దలు, గ్రామ పురోహితులు, కొందరు ప్రజలు తీసుకొస్తున్నారు ). శ్రీ భావన్నారయన స్వామివారిని దక్షిణాభిముఖం గా స్వామివారికి ఎడమ వైపు ప్రత్యేక ఆలయం నిర్మాణం చేసి అందులో శ్రీ సోమేస్వర స్వామిని తూర్పుముఖంగాను ప్రతిష్ఠించి సివద్రుష్టికి గాను ఆలయమ గోడకు రంధ్రములు వదిలి గుడి నిర్మించారు
క్రిమికంఠచోళుడు
క్రీ.శ. 594 సం|| లో భావనారాయణ స్వామి వారిని క్రిమికంఠ చోళ చక్రవర్తి ప్రతిష్ట చేసెనట్లు స్దల పురాణము, స్దానిక కైఫీయతు తెలుపుతున్నప్పటికీ ఆ పేరుగల చక్రవర్తి చరిత్ర పుటల్లో లభ్యం కారేదు. శైవ, వైష్ణవ ఆచారాల మద్య ఆధిపత్య పోరు జరుగుతున్న 11వ శరాబ్దంలో శైవుదైన మొదటి కులోత్తింగుడు [శ్రీ.శ. 1070-1120] వైష్ణవుడైన రామానుజాచార్యుల వారిని [1016-1137] పీడించడంతో రామానుజాచార్యుల వారు చిదంబరం గుడిలోని గోవిం రాజస్వామి విగ్రహాన్ని, ఉత్సవ విగ్రహాలను తిరుపతి [క్రొత్తూరు] కి తరలించారు. ఐతే అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఎర్పడడంతో అక్కడినుంచి కర్ణాటక దేశానికి తరలి, మాంద్యా సమీపంలోని మేల్కోంటే [తిరునారాయణపురం] లో తలదాచుకున్నారు. రామానుజాచార్యుల వారిని ఆవిధంగా పీడించిన మొదటి కులోత్తుంగుడిని వైష్ణవ వాజ్ఞ్యం "క్రిమికంఠ చోళుడు" అని నీచంగా అభివర్ణించింది. ఐతే అధిరాజేంద్ర చోళ రాజే [క్ర.శ 1070] క్రిమికంఠచోళుడు కావచ్చనే అభిప్రాయం కూడా చరిత్రకరుల్లో ఉంది. కాని స్దల పురాణం ప్రకారం ఆలయన్ని నిర్మించిన రాజు 6వ శతాబ్దినాటి క్రిమికంఠచోళుడు. కాగా వైస్ణవులచే క్రిమికంఠునిగా అభివర్ణించబడ్డవాడు 11వ శతాబ్దానికి చెదిన మొదటి కులోత్తుంగుడు [లేదా అధిరాజేంద్రుడు] ఈ ఇద్దరి చోళ రాజుల నదుమ ఐదు శతాబ్దాలకు పైగా అంతరం స్పష్టంగా కనిపిస్తుండడంతో చారిత్రక ఆధారాల్లో కొంత అస్పష్టత ఏర్పడింది. ఏదేమైనా చరిత్రకు అందని అనేక సాక్ష్యాధారాల వలనే క్రీ.శ. 594 సం|| నాటి ఆలయ నిద్మాణ ప్రారంభోర్సవ అధికారిక శాసనాధారాలు లభించలేదు.
1110 సం|| లో వేర ప్రతాప శూర మహామందలేశ్వర బల్లియ చోళ మహరాజు పట్టాభిషిక్తుడైన తరువాత భావనారాయణ స్వామి వారి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వర్షోత్సవ, తిరుపావళి మొదలైన ఉత్సవాలు జరిపించి, గ్రామం నలుదిక్కులా పొలిమేర చిన్నెలు ఏర్పాటుచ్చేశాడు. తూర్పున "వెలిచర్ల" అను గ్రామన్ని దక్షిణాన బంగాళాఖారమును, నైఋతి దశన "మోటుపల్లి" అను రేవు పట్టణమును, పశ్చిమాన "ఉప్పుటూరు" [లవణపురి] ను, వాయవ్యమున "పోతుకట్ల" [పోతినేనివారిపాలెం], ఉత్తరాన రేటూరును, ఈశాన్యమున "పూండ్ల", "అప్పికట్ల"ను పొలిమేరలుగా ఏర్పరిచాడు.
క్రీ.శ. 1136 లో గజపతి వారసుదైన గజపతి మహరాజు ఈ రాజ్యాన్ని అక్రమించి పాలించే కాలంలో వీరి ప్రధానియైన గోపరాజు రామన్న బాపట్ల వారికి, దేశిరాజు వారికి, ఆముదాలపల్లి వారికి, శిఖరం వారికి, స్దానం వారికి శూద్రులలో శిఖరం వరికి మొత్తం ఆరు సంతుల వారికి గ్రామ మిరాశీలు ఏర్పాటుచేశాడు. కుమార కాకతీయ రుద్రదేవ మహారాజు 1319 ప్రాంతంలో పాలించిన తరువాత రెండవ ప్రతాపరుద్రుని అనంతరం రెడ్డి రాజులు పాలనలోకి వచ్చారు. 1325 లో ప్రోలయ వేఆరెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్దాపించాక పలువురు రెడ్డి రాజులు 1424 వరకు పాలించారు. వీరి తర్వాతి పాలకుడైన వీరభద్ర గజపతిని, అనంతరం కొండవీటి దుత్గాన్ని 1515 లో శ్రీకృష్ణదేవరాయలు జయించాడు. తరువాత అచ్యుతరాయలు, సదాశివరాయలు, రామరాయలు, తిరమలరాయలు, శ్రీరంగరాయలు మొదలగు రాజులు 1565 వరకు పాలించారు. తరువాత తురుఘ్కలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. వేరిలో నాసర్ జంగ్ ఈ సర్కారులను ఫ్రించివారికి విక్రయించాడు. ఫెంచివారు పరిపాలించిన ఏడు సంవత్సరాలలో చివరి సంవర్సరమైన 1758లో వీరు అష్ట దిక్కులందున్న శక్త్యాలయాలను ధ్వంసం చేశారు. భావనారాయణ స్వామి దేవాలయంలో విధ్వంసం సృష్టించరు. ఈ దురంతంతో స్వామివారికి ఏడాదిపాటు పూజాదులు జరగలేదు.
తదుపరి ఈ పట్టణం 1759లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి పరిపాలనలోకి రావడంతో ఆ కాలంలో వారి దివాను గారిన రాజమండ్రికి చెదిన శ్రీ రాజా కాండ్రేగుల జోగీ జగన్నాధరావు బహదూరు గారు తన పర్యటనలో బాపట్లకు విచ్చేసి మూలవిరాట్టు పునఃప్రతిపి, మరలా నిత్య నైవేద్య దేపారాధనలు జరిగేటట్లు ఏర్పాట్లు కావించారు. అత్చనాదులు నిర్వహించడానికై గౌతమస గోత్రులైన శ్రీమాన్ నల్లూరి నరసిం హాచార్యులు భర్గవస గోత్రులైన శ్రీమన్ శ్రీనివాసుల భావనారాయణగార్లను నియమించారు. అంతేకాకుండా శ్రీవారి దేవాలయములోనున్న శ్రీ సోమేశ్వర స్వామి వారికి నూతన ఆలయాన్ని ఏర్పాటుచేయదలచి, ఆలయంలోని తూత్పు భాగమున 50 మీ. దూరంలో ఒక నూతన ఆలయాన్ని నిర్మించి అందులో ప్రాజ్ఞ్మ్ ఖంగా ప్రతిష్టించి నిత్య నైవేద్య దీపారాధనలకు పుర్తి ఏర్పాట్లు చెయించారు.స్వామి వారి కైంఠకర్యమునకు స్వర్ణబ్రహ్మన్న అను శివద్వజుని నియమించారు.
1803 వరకు జగన్నాధరావు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా తన భాధ్యతలను ఎంతో సమత్దవంతంగా నిర్వహించిన తరువాత ప్రభుత్వము సర్కారీ వేలము వేయగా శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు [1761-1816] ఈ ప్రాంతాన్ని కొని అమరావతి రాజధానిగా 1811 వరకు అత్యంత సార్దవంతంగా పాలించారు. శ్రీ రాజా వారు స్వామి వారికి ఎన్నో సేవలు చేసి, ఎన్నో కానుకలు అందించారు. వీరు ఆలయ ధర్మకర్తృత్వమును విరమించుకున్న పిదప అర్చక స్వాములు పూర్వము సోమేశ్వర స్వామివారు
వేంచేసియున్న చోట గోదాదేవిని ప్రతిష్టించారు. శ్రీ వీరభోగ జ్వాలా నరసిం హ స్వామి దేవాలయాని కి కుడి ప్రక్కన శ్రీ తాలూకాకి తహసీల్దరుగా వచ్చిన వింజమూరు వేంకటరావు పంతులు గారు దేవాలయ స్దితిగతులను పరిశీలించి ఉత్సవాలను ఘనంగా జరిపించారు.
కైఫియ్యత్తులో వివరింపబడిన పై వివరణకు, నేటి వరకు లభ్యమైన ఇతర చారిత్రక ఆధారాలకు మద్య కొంత వ్యత్యాసముండడంతో ఆలయ సమగ్ర చరిత్రలో కొంత అస్పష్టత గోచరిస్తుది. కులోత్త్తుంగ చోళుదు పేరు మీద ముగ్గురు చక్రవర్తూ ఉండదం [మొదటి కులోత్తుంగుడు ఖ్రీ.శ. 1070 నుండి 1120 వరకు, రెండవ కులోత్తుంగుడు క్రీ.శ. 1135 నుంది1150 వరకు] వారి పరిపాలనా కాలాల్లో చరిత్రకారుల్లో స్వల్ప భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడతోపాటు కైఫియ్యత్తులను గ్రామ కరణాలు ఇతర గ్రామ పెద్దలు కలిసె ఆధారరహితంగా నిర్ణయించినవి కావడమే ఈ అస్పష్టతకు కారణం..
భిన్న సంప్రదాయాల విశాల భారతావని ఒక్కో ప్రాంతంలో ఒక్కో శైలిని దేవాలయల నిర్మాణాల ద్వారా తెలియజేస్తుండడంతో ఈ నిర్మాణాలు సంస్కృతీ సంప్రదాయాలపరంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్దానంలో నిలబెట్టాయి. కాబట్టే ప్రపంచ పర్యాటక రంగంలో మన దేవాలయాలకు ప్రముఖ స్దానం లభించింది. భారతీయ కళకు, తద్వారా భారతీయ సంస్కృతికి సోపానాలుగా నిలుస్తున్న అనేక దేవాలయాల కోవలోనే పలుచారిత్రకాంశాలకు, లలిత కళలకు సజీవ సాక్ష్యం గా నిలుస్తోంది. బాపట్ల భావనారాయణ స్వామి దేవాలయం.
దక్షిణ దిక్కుకు అభిముఖంగా 19.85ని25.85 మీటర్ల విస్తీర్ణంతో సమచతురస్రాకారంలో నిర్మించబడిన ఈ ఆలయ నిర్మాణంలో తెలుగు చోళుల శైలి అణువణువునా సందర్శకులకు కనువిందు చేస్తుంది.ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అత్యంత వైభవంగా నిలువెత్తున నిలిచిన గాలిగోపురం మహద్వారమై సందర్శకులకు మహా స్వాగతం పలుకుతూ ఆలయంలోకి ప్రవేశించిన ప్రతి పర్యాటకునికీ అనిర్వచనీయమైన భావన కలిగిస్తుంది. ఈ మహద్వార గోపురం ద్వారా లోపలకు ప్రవేశించగానే కనిపించే బలిపీఠం, కీర్తి ధ్వజ స్తంభం,జీవ ధ్వజ స్తంభాలతో ఆలరారే విశాలమైన ప్రాంగణం, ప్రాంగణంలో ద్వితలంగా చరిత్రకు సజీవ సాక్ష్యమై శోభాయమానంగా వెలుగురున్న ఆలయం, ఆలయం చుట్టూ నిర్మించబడిన విశాలమైన ప్రాకారం మరింత ఆహ్లాదాన్నిస్తాయి. ప్రాంగణంలోకి ప్రవేశించిన పిదప ఎడమవైపున నిర్మించబడిన మంచి నీటి బావి వద్ద పాద ప్రక్షాళన కావించి, ముఖమండపం ద్వారా ఆంతరాలయంలోకి ప్రవేశించి, అర్దమండపం ద్వారా గర్భాలయంలోకి దృష్టిసారిస్తే దర్శన భాగ్యం లభిస్తుంది. "విమానార్చనకల్ప"లో శ్రీమన్నరాయణుడు నాలుగు హస్తాలను కలిగివుంతాదని అభివర్ణించబడింది. అదే రీతిలో శ్రీ భావనారాయణుదు వెనకవైపు కుడి చేయి కమల హస్తంగా, ముందు వైపు ఎడమ చేయి కఠి హస్తంగా భక్తకోటికి దర్శనభాగ్యన్ని కల్పిస్తున్నాయి. అంతరాలయం లో అంజనేయ స్వామి, పడమరన కేశవస్వామి విగ్రహాలను తూర్పు ముఖంగాను, స్వామి వారి పర్యంక మందిరము, ఆసీన రీతిలోని రాజ్యలక్ష్మీ అమ్మవారు, విఖనసాచార్యులు, రంగనాధ స్వామి, సమభంగ స్దానక రీతిలోని గోదాదేవి, స్దానక రీతిలోని కోదండ రామస్వామి, ఆసీన రీతిలోని వీర భోగ జ్వాలా నరసిం హ స్వామి, 10 మంది ఆళ్వారులతో శ్రిరామానుజాచార్యులు మరియు 112 గ్రంధాలకు పైగా శ్రీ వైష్ణవ గ్రంధాలను రచిచిన "కవితార్కికకేసరి" బిరుదాంకితులైన వేదాంత దేశికుల వారితో తిరుచుట్టు మాలిక అలంకరంపబదగా కేంద్రస్దానంలో స్వామివారి దివ్వ స్వరూపం అఖిలాండ కోటికి అనంత వరాల జల్లులను కురిపిస్తూ దివ్వ ప్రకాశాలను వెదజల్లుతుంటుంది. ప్రతిఫ్టా కాలంలో తొలుత శ్రీ భవనారాయణ స్వామి వారితోపాటు ఈశానంలో శ్రీ సోమేశ్వరస్వామిని తూత్పుముఖంగాను, ఆగ్నేయంగా శంఖచక్రాభరణాలతో కూడిన శ్రీ వీర భోగ యోగ జ్వాలా నరసిం హ స్వామిని పశ్చిమముఖంగాను, నైఋతియందు శాంతముర్తి శ్రీ కేశవ స్వామిని తూర్పుముఖంగాను
శాసనాలలో అధిక భాగ అఖండ దీప దాన శాసాలు కావడం విశేషం. ఈ దానాలన్ని పండుగ దినాల్లో చేయబడినవి. 66 శాసనాల్లో ఈ విషయంస్పష్టంగా లిఖించబడినది. 18శాసనాల్లో దానాలు ఉత్తర సంక్రాంతినాడు వేయించినట్లు వివరింపబడగా ఒక శాసనం దక్షిణాయన సంక్రాంతి పర్వ దినాన వేయించినట్లు తెలుపుతుంది. 6 విష్ణు సంక్రాంతి సందర్భంగాను, 4 సూఅర్యగ్రహణం సందర్భంగాను, 1 చంద్రగ్రహణం సందర్భంగానూ వేయించబదినవి. 6 అమావస్య దినం సందర్భంగను, 10 దాన శాసనాలు పౌర్ణమి సందర్భంగనూ వేయించబడినవి. కగా 9 శాసనలు ఏకాదశి సందర్భంగా ప్రతిష్టించబడిన దాన శాసనాలు. అందులో 5 లొలి ఏకాదశిని వాయవ్వంలో అభయ వరద ముద్రలతో దక్షిణ దిక్కుకు అభిముఖంగా శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీ తాయారును మాత్రమే ప్రతిష్టించడం జరిగింది. కాలానుగతంగా ఈశాన్యంలో శ్రీభూసహితముగా రంగనాధుని ప్రతిష్టించారు. రంగనాధుని నాభిజనితునిగా బ్రహ్మదేవుడిని దక్షిణాభిముఖంగాను, అనంతుని పాంపుగాను, పాదాల వద్ద పశ్చిమాభిముఖంగా మధుకైటభులను, క్రిమిదంఠ చోళరాజు సుధామూర్తులను వారిని, వారి ముందు భృగు మరియు అత్రి మహర్షులను తుర్పుముఖంగాను మరీచి మరియు కశ్వప మహర్షులను పశ్చిమముఖంగానూ ప్రతిష్టించారు శ్రీ భావనారాయణుడు స్వామి వారి ఆలయంలోని శ్రీ సోమేశ్వరస్వామి వారిని ప్రత్యేక ఆలయంలో ప్రతిష్టించిన తరువాత ఆ ఆలయంలో అర్చక స్వాములు శ్రీ గోదాదేవిని తూర్పుముఖంగా ప్రతిష్టించారు. అదే సమయంలో శ్రీ జ్వాలా నరసిం హస్వామికి కుడి భాగంలో శ్రీ సీతా లక్ష్మణ స్మేత శ్రీ కోదండ తాములస్వామి వారిని పశ్చిమాభిముఖంగా ప్రతిష్టించారు.కేశవ స్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారు, నరసిం హస్వామి మరియు గోదాదేవి ఆలయాల మీద ప్రత్యేకంగా నిర్మించబడిన నాలుగు గోపురాలు ఆలయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచాయి. గోదాదేవి ఆలయం మీద నిర్మించనడిన గోపురం క్రిమికంఠ చోళుడు నిర్మించినది కాగా మిగిలిన మూడు గోపురాలు జగన్నాధరావు పంతులు గారు శివాలయాన్ని నిర్మించే సమయంలో 18వ శతాబ్డంలో నిర్మించినవి. వాయవ్యమూలంగా దక్షిణానికి అభిముఖంగా శ్రీ విఖనసాచార్యుల వారి మందితంలో విఖనసులతోపాటు భృగు, మరీచి, అత్రి మరియు కశ్యప ఋషులు అసీనులై ఉండడం వేదకాలం నాటి సంస్కృతిని తలపిస్తుండగా ఆగ్నేయాన గల గదిలోని అళ్వారుల విగ్రహాలు ఈ ఆలయానికీ, శ్రీ వైష్ణవానికి గల అనుబంధాన్ని తెలుపుతున్నాయి. ఆళ్వారులలో పూదత్త అళ్వారు, పెతియాళ్వారులలో [గోదాదేవి తండ్రి] తొందరది ప్పొడి ఆళ్వారు [విప్రనారాయణ] పేయాళ్వారు, తిరుప్పణియాళ్వారు, మధురకవి ఆళ్వారు, తిరుమలిశై, కులశేఖర, పోగైయాళ్వారులు పద్మాసనంలో ఆశీనులైయుండగా తొరుమంగై ఆళ్వారు ప్రతిమ ఖడ్గం, డాలు ధరించి నిలబడి ఉంటుంది. వివిధ కులాలకు చెందిన 12 మంది ఈ ఆళ్వారులు సంస్కృతంతోపాటు, పామరులకు అర్దమయ్యేందుకు వీలుగా తమిళంలో శ్లోకాలు రచించారు. విశిష్టాద్వైతానికి విశిష్ట రూపాన్ని కల్పించారు.
పాదబంధ అధష్ఠానం గల ఆలయ కుడ్య భాగంలో 5 దేవకోష్ఠాలు [గూళ్ళు] కోష్ఠాలపైన గల మకర చిత్ర తోరణాలు, బ్రహ్మకాంత కుడ్య స్తంభాల్లు చోళ శైలిని పోలివుంటాయి. ఒకప్పుడు ప్రతి కోష్ఠంలోనూ స్వామి వారి ప్రతిమ ఉండేది. ఫ్రెంచివారు వాటిని ద్వంసం చేసెన తరువాత మరలా ప్రతిమలు ఏర్పాటు చేయబడలేదు. కుట, శాల, పంజర హారములతో కూడిన ఏకతల విమానము, గర్భగుడి, ముఖమండప ద్వారాల దగ్గర గల ద్వారపాలక విగ్రహాలు, అర్దాండప ద్వార బంఢాలపై చిత్రంచబదిన పురాణ ఘట్టాలు, పలు కుడ్య చిత్రాలు, ద్వార తోరణాలు, చిత్ర తోరణాలు, స్తంభ తోరణాలు వంటి కళాత్మక అలంకరణలు ఆలయ అందాన్ని ఇనుమడింపజేస్తూ నటి శిల్ప కళా చాతుర్యానికి మచ్చుతునకలుగా నిలుస్తునాయి.
దేవకర్ముల గురించి 4 శాసనాల్లో వివరించబడింది. వీరు కూడా భాహ్మణవర్గానికి చెందిన వారేనని తెలుస్తున్నది. స్దానపతి తర్వాతి స్దానంలో దేవకర్మి ఉండేవాడు. దేవాలయ సంపద నిర్వహణ బాధ్యత ఇతడు వహించేవాడు. 1107 నాటి శాసనంలో దేవకర్మిగా భావనారాయణ బ్రహ్మమారాయరణ్ ఉన్నట్లు తెలుస్తుంది. 1156 నాటి శాసనం భావరాజు మతో కుమారుడైన గోకన దేవకర్మిగా వ్యవహరించినట్లు తెలుపుతున్నది.
శ్రీవైష్ణవులు
దేవాలయానికి సంబంధించిన క్రీ.స. 1023 నాటి తొలి శాసనంలో వీరి గురించి ప్రస్తావన ఉంది. దీన్నినట్టి ఆలయానికీ, వీరికీ గల అనుబంధం ప్రగాఢమైందని తెలుస్తుంది. దేవాలయానికి దానంగా ఇవ్వబడ్డ గ్రామాల బాధ్యత వీరు వహించినట్లు క్రీ.శ. 1043 నాటి శాసనం తెలుపుతున్నది. అంతేకాకుండా శ్రీ వైష్ణవ ఆధికారిని గురించిన క్రీ.శ. 1107 నాటి శాసనంలో ఉండడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది.
కాకతీయ గణపతిదేవుడు 1210లో వెలనాటి పృధ్వీశ్వరుణ్ణి చంపి, ఈ ప్రాంతాన్ని జయించిన తరువాత 70 సంవర్సరాలపాటు ఇక్కడ ఒక్క శాసనం కూడా నమోదు కాలేదు. అదేవిధంగా 1318 తర్యాత ఏకంగా రెండు వందల సంవత్సరాలపాటు ఇక్కడ ఒక్క శాసనం కూడా ప్రతిష్ఠించబడకపోవడం విషేషం.క్రీ.శ 1147 నాటి శాసనంలో ఈ అలయానికి అఖండ దేప దానం చేసిన దాత పంచారామాలకు, ఢరణికోటలోని బుద్ద దేవాలయనికీ దానాలు చేసినట్లు పేర్కొనబడింది. మతో దాత తాను శైవ భక్తుడనని పేరొనడం విశేషం. వీటినిబట్టి ఇది వైష్ణవాలయ మైనప్పటికీ అనేక మంది శైవ మతస్దులు, ఇతరులు ఈ ఆలయానికి దానాలు చేయడం విశేషంగా పేర్కొనవచ్చు.
Suryalanka Beach is situated at a distance of 9 kilometers from the town of Bapatla, in Guntur district. The natural beauty of the beach and its closeness to the town attracts tourists who often return to the calmness of the sea for the weekend. The shore of the beach is wide and spacious. The Suryalanka Beach overlooks the crystal blue waters of the Bay of Bengal. It’s the only nearest beach from Hyderabad in Andhra Pradesh and quite spoken about.it is continued from Chirala.
Thanks to Andhra Pradesh Tourism and Development Corporation, they have a Haritha Beach Resort set-up over there which is the only one available. If anyone is unlucky to get an accommodation which means they can still get a hotel or a lodge booked in Bapatla town and have to commute all the way to the beach for fun. APTDC has built-up 10 A.C. rooms with a restaurant and camp fire facility.
It is still a fact that many people(saints, seekers, sadhakas, devotees and common people) feel some unknown power, calmness, peace in the temple.
శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయ చరిత్ర
బాపట్ల ఆవిర్బావ చరిత్ర
[శ్రీమత్సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ శ్రీ శ్రీ భావనారాయణస్వామి వారి ఆలయ చరిత్ర]
దివ్యం క్షీరపయోధిమధ్యశయనం దేటప్యమానంవరం[శ్రీమత్సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ శ్రీ శ్రీ భావనారాయణస్వామి వారి ఆలయ చరిత్ర]
కోటీరామలమందరాచలధరం సర్లంధరం సుందరం
మందస్మేరసుధామనోజ్ఞ వదనం మార్తాండలోటిప్రభం
శ్రీమద్బావపురీశమీశ మనిశం శ్రీ భావనారాయణం||
మద్య యుగ చరిత్ర, సంస్కృతుల అద్యయనానికి దేవాలయాలే ప్రధన కేంద్రాలు. భారతీయ సంస్కృతికి జీవగఱ్ఱలైన
దేవాలయాల నిర్మాణాలకు వాడిన శిలలు ఆ శిలలపై చెక్కబడిన శిల్పాలు, లిఖించబడిన శాసనాలు చారిత్రక పరిశోధనకు ఎంతగానో దోహదపడుతున్నయి. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్న నానుడిలొ ఎంత వాస్తవమున్న ఆ రాళ్ళే శాసనాలుగ మనకు ఆనాటి చారిత్రకాంశాలను తెలియజేసే ప్రధనాంశాలు కావడం మన అదృష్టం. చరిత్ర మనకు వారసత్వంగా అందజేస్తున్న ఈ శిలా సంపద ద్వారా అనేక గ్రామ ఆవిర్భావాల చరిత్ర మనకు వెల్లడవుతున్నది ఆ కోవలోనే మద్య యుగం నుండి నేటికి భక్తులను ఆకర్షిస్తూ గొప్ప ఆరాధనా కేంద్రంగా విలసిల్లుతున్న బాపట్ల శ్రీ భావనారాయయ స్వామి దేవాలయం కూడా బాపట్ల గ్రామ ఆవిర్భావానికి అంకురార్పణ చేసిన క్షేత్రంగా చరిత్ర కెక్కింది. తీరాంధ్రలోని తొలి వైష్ణవాలయం ఇదే. వెలనాటి సీమలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఈ వైష్ణ్వ క్షేత్రం బాపట్ల చరిత్ర సంస్కృతి, శతాబ్దాల సామాజిక వ్యవస్దలను వెల్లడించే ఆద్యాత్మిక కేంద్రమై 1417 సంవర్సరాలుగా తనలో ఇముడ్చుకున్న అనేక జ్ఞాపకాలను శిలా శాసనాల రూపంలో మనకు అందిస్తొంది. అలనాటి తన ప్రాభవాన్ని నేటికీ కోల్పోకుండా వైభవోపేతంగా విరాజిల్లుతోంది .
స్దలపురాణము
ఈనాటి పురాతన దేవాలయాన్ని వేదకాలం నాటి యాగశాలలే భావనారాయణ స్వామి ఆలయం కృత యుగంలో బ్రహ్మరణ్యమనీ, ఇక్కడ విష్ణుమూర్తి గురుంచి బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడనీ, కృత, త్రేత, మరియు ద్వాపర యుగాలలో బ్రహమర్షులు ఇక్కడ యాగకుండాలను ఏర్పాటుచేసి శ్రీమహావిస్ణువు సాక్షా త్కారానికై ప్రశస్త ద్రవ్యములతో హోమం నిర్వహిస్తుండేవారనీ,
అప్పుడు నారాయణుడు వేవ్వేరు యుగధర్మాలను అనుసరంచి, ఆయా యుగాలకు చెందిన రూపాలతో వారికి దర్శనమిచ్చేవాడని వివరించబడింది. అంతేకాకుండా ఆ యాగ గుండములో ఒక క్షీర వృక్షం మొలిచిందనీ, మొలిచినా క్షీరవృక్షంలోనే బ్రహ్మర్షులు,ఆరాదించిన శ్రీమన్నరాయణుడు నిగూఢంగా ఉండిపోయాడనీ మహామహిమాన్వితమైన ఈ పుణ్య క్షేత్రమందు కలియుగంలో స్వామి వారు స్వయంవ్యక్తమయ్యారనీ స్దల పురాణం చెబుతున్నది
బాపట్ల ఆవిర్భావ చరిత్ర - కైఫియత్తులోని వివరణ
ప్రతి గ్రామ చరిత్రను గ్రంధ రూపాన నిక్షిప్తం చేయడం ద్వార గ్రామ ఆవిర్భావాలను, ఆ సందర్భంగా జరిగిన పలు సామాజిక సంఘటనలను భావితరాలకు తెలియజేసే సంకల్పంతో కల్నల్ మెకంజి మెకంజీ [1757-1821] గ్రామ చరిత్రల రచనలకు శ్రీకారం చుట్టాడు. ఈ గ్రామ చరిత్రలనే కైఫియత్తులు అంటారు. నాటి ఆమ కరణాలను, స్దానిక రాజకీయ సేవకులను, విశ్లేషకులను ఈ బృహత్కార్య నిమిత్తం మెకంజీ నియోఅగించాడు. ఒక్కోగ్రమ చరిత్రకు ఒకూఅ కైఫియత్తును రూపొందిచాడు. ఆవిధంగా రూపొందించబడ్డ బాపట్ల కైఫియత్తులో బాపట్ల ఆవిర్భావ చరిత్ర ఈ క్రింది విధంగా వివరించబడింది.
బాపట్ల సమీప గ్రామమైన కొండపాటూరు నుండి ఒకనాడు బావ-బావమరుదులు ఇద్దరు కట్టెలు కొట్టుకోవడానికి ప్రస్తుత భవనారాయణ స్వామి దేవస్దానమున్న ప్రామ్రానికి వచ్చారు అది అప్పట్లో పూర్తిగా అటవీ ప్రాతం అక్కడ మామూలు వృక్షాలతోపాటు శాఖోపశాఖలుగా విస్తరించి వున్న అనేక క్షీర వృక్షాలు [పాలచెట్లు] కూడా ఉన్నాయి. ఇద్దరు చెరో దిక్కుకెళ్ళి చెట్లుకొట్టడం ఆరంభించారు. అందులో "బావ" ఒక క్షీర వృక్షం మీద వేసిన గొడ్డలి వేటుకు ఆ చెట్టు నుంచి అనూహ్యంగా రక్తం స్రవించడంతో ఆ రక్తాన్ని చూఅసిన అతను భయోత్పాతంతో మూర్చిల్లాడు. వేరే దిక్కున చెట్టు కొట్టందుకు వెళ్ళిన బావమరిది తన పని పూర్తి కాగానే బానను వెదుకుతూ "బావ" అని పివగా ఒక పాల చెట్టు నుంచి "ఓయ్" అని స్వరం వినపడడంతో అతను ఆ దిక్కుకు వెళ్ళి అక్కడ రక్తం స్రవిస్తున్న చెట్టును, దాని చెంతనీ స్పృహతప్పి పడున్న తన బావను చూసి కంగారుగా మళ్ళీ "బావా" అని పిలిచాడు. మరలా అదే చెట్టు నుంచి వచ్చిన ఆ సమాధానానికి ఆశ్చర్యచకితుడయ్యాడతను. అది దై వ మాయగా భావించిన అతను క్షణంలో జరిగిన తప్పును గ్రహించాడు. ఆవెంటనే తమ తప్పును మన్నించమనీ, తమని మన్నించి కరుణిస్తే పొంగళ్ళు పెట్టుకుంటామనీ ఆ చెట్టునే ప్రార్దించడంతో అతని బావ తిరిగి స్పృహలోకి వచాడు. దాంతో ఆ చెట్టుగల గల ప్రాంతం మహిమలతో కూడుకున్నదని భావించిన ఆ ఇద్దరూ ఆనాటినుంచి ఆచెట్టును పూజించడం ప్రారంభించారు. అంతేకాకుండా తాము మొక్కుకున్న విధంగా ప్రతి ఆదివారం నాడు వారు ఆ వృక్షానికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నమర్పించసాగారు.
ఇదిలా వుండగా వీరప్రతాప క్రికంఠ చోళుడు పనే చోళ రాజు తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా క్రీ.శ. 6వ శతాబ్దం చివరి భాగంలో కావేరి నదీ తీరం నుండి దిగ్విజయ యాత్రకై బయల్దేరి, సమస్త రాజులను జయించి తిరిగివెళ్తూ,విశ్రాంతి నిమిత్తం "ఆముదాలపల్లి" గ్రామం వద్ద త సైన్యంతో మజిలీ చేశాడు. రాజు, ఆయన పరివారం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలొ ఆరాజుగారి పట్టపుటేనుగులు తమ అహారం నిమిత్తం ఆ ప్రాంతమంతా వచ్చాయి. ఆ ప్రాంతంలోని క్షీర వృక్షాలను చూడగానే వాటికి ఆకలి రిట్టింపై వెంటనే ఒక క్షీర వృక్షాన్ని తమ తొండములతో విరచి తినడానికి ప్రయత్నంచాయి. అయితే విచిత్రంగా ఆ ఏనుగుల తొండములు ఆ పాలచెట్టుకు అతుక్కునిపోవడంతో భీతిల్లిన మావంటివాడు పరుగు పరుగున మహరాజు దగ్గరకు వెళ్ళి ఆ సంఘటనను వివరించాడు . ఆ వార్త ఎంతో చిత్రంగా అనిపించడంతో వెంటనే చక్రవర్తి తనే స్యయంగా తన పరివారంతో సహా ఆ చెట్టు దగ్గరకు చేరి దానికి అతుక్కునిపోయిన తన పట్టపుటేనుగులను చూసి మరింత ఆశ్చర్యానికి గురయ్యాడు. అది భగవానుని లీలగా గ్రహించి, చేతులు జోడించి, ఆ వృక్షరాజంతో "ఓ క్షీర వృక్ష్మా! నీ మహిమ తెలియక తప్పు జరిగింది. నా నేరములు మన్నించి నా ఏనుగులను కాపాడుము" అని శరణు వేడడంతో వెంటనే స్వామి ఇద్దరు విప్రులలో ఆవహించి, "ఓ చోళ మహారాజా ! ఏనుగు పాదములవంటి స్తంభములతో విరాజిల్లు ఒక ఆలయమును ఈ ప్రాంతమున నిర్మించి నన్ను ప్రతిష్ఠింపుము, నా పీరుతో ఒక పట్టణమును నిర్మింపుము, అప్పుడు మేము ప్రసన్నులమవుతాము, అనడంతో దానికి చొళ మహారాజు మహదానందభరితుడై వెంటనే అంగీకరించాడు. వెంటనే ఆ ఏనుగులకు స్వస్దత చేకూరి అవి అక్కడినుంచి వెళ్ళిపోవడంతో స్వామివారి మహిమను అనుభవపూర్వకంగా గ్రహించిన అతను ఆముదాలపల్లిలోనే స్దిర నివాసమేర్పరచుకొని ఆలయ నిర్మాణానికి పూనుకొన్నాడు. ఇద్దరు విప్రుల ద్వారా తన భావాలను వ్యక్తం చేసిన నారాయణుడిని భావనారాయణుడన్న పేరుతో ప్రతిష్ఠింపదలచి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు ఆవెంటనే చిలకలూరిపేట నద్ద గల బొప్పూడి కొందనుండి రాళ్ళు తెప్పించి,పనులు ప్రారంభించాడు. రే నిర్మించిన ప్రతి కట్టడం మరునాటికే శిధిలమైపోతుండడంతో చక్రవర్తి మళ్ళీ దైవాన్ని ప్రార్దించాడు. అప్పుడు స్వామి చక్రవర్తికి స్వప్నంలొ సాక్షాత్కరించి "ఓ రాజా! వెంకతగిరి సంస్దానమునందు చిమ్మిరిబండయను కొండగలదు.
అందలి రాళ్ళు కృష్ణవర్ణమయములు. ఆ కొండయందలి రాళ్ళకు శీతాకాలమున వెచ్చదనమును, గ్రీష్మమున చల్లదనము నొసంగెడి లక్షణము కలదు. ఆ రాళ్ళ తో ఆలయ నిర్మాణమును చేయుము" అని పలకగా ఆ రాజు వెంకటగిరి రాజు గారి అనుమతితో ఆ సంస్దానమునందలి చిమ్మిరిబండ కొండనందలి రాళ్ళను ఏంతో వ్యయ ప్రయాసలకోర్చి తెప్పించి, ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు.
పునాదులు తవ్వుతుండగా ఆ త్రవ్వకంలో ఒక వల్మీకము [పుట్ట], అందులో శ్రీ వీరభొగ యోగ లక్ష్మీ సమేత జ్వాలా నరసిం హ స్వామి విగ్రహము బయటపడ్డాయి. హిరణ్య కశిపుని వధానంతరం శాంత రసనికి చేరుకుంటున్న జ్వాలా నరసిం హ స్వామి రూపమది. ఆ విగ్రహమును అక్కడినుంచి కదిలించటానికి సాధ్యం కాకపోవడంతో ఆ రాజు తూర్పుదిక్కున తిరుచుట్టు మాలిక వెడల్పు పెట్టించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించారు ఐతే పుట్టనుండి బయటపడ్డ జ్వాల నరసిం హ స్వామి వారిద్రుస్ఠి అక్కడికి ఆరుక్రోసుల దూరంలో గల కారంచేడు గ్రామంపై పడి ఆ ఊరు ధగ్ధ మవడంతో ఆ దోష నివారణకు శ్రీ శాంతకేశవ స్వామిని శ్రీ జ్వాలా నరసిం హ స్వామికి అభిముఖం గా ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేసాడు.
ఓ వంక దేవాలయ నిర్మణం చురుగ్గా సాగుతుండగా కొండపాటూరు గ్రామంలో ఓ క విచిత్రమైన సంఘటన జరిగింది ఆ గ్రామంలో ఓ క జున్న పాతర యందు అమ్మవారి విగ్రహము బయటపడింది ఆమె అక్కడి కాపులతో నేను శ్రీ భావన్నరాయన స్వామి వారి దేవేరిని నా పేరు రాజ్యలక్ష్మి నాకు ఈ ఊరే పుట్టినిల్లు మా అత్తగారి ఊరు భావపట్ల, పుట్టినింటివారే నాకు మంగలద్రవ్యములను ప్రతిసంవత్సరం కల్యాణోత్సవములో సమర్పించవలెను అని చెప్పడం తో గ్రామస్తులు వెంటనే చొళ మహారాజు కు ఆ సంఘటను తెలియజేసారు, మహారాజు ప్రమానందంతో గ్రామీణుల సహకారంతో కొండపాటూరు నుండి శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మి తాయారు విగ్రహాన్ని తెప్పించి శ్రీ భావన్నారాయన స్వామి వారికి వాయవ్య దిగ్భాగాన దక్షిణాముఖంగా ప్రతిష్ఠ చేయించి ఆ దేవేరి కి గజపాదాకార స్తంభాలతో నిర్మించి ఆలయంలోనే మరో ఆలయాన్ని నిర్మిచారు ( అది మొదలు నేటికి కూడా స్వామివారి కల్యాణమహోత్సవానికి కొండపాటూరు గ్రామమ్నుండి మంగలసూట్రం మెట్టెలు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ, తలంబ్రాలు వంటి మంగల ద్రవ్యాలు రావడం ఆచార మైఇంది ఓకప్పుడు ఈ మంగళ ద్రవ్యాలను గ్రామస్తులనుంచి గ్రామ కరణం సేకరించి తీసుకోచేవారు. ఇప్పుడు కొండపాటూరు గ్రమ పొలేరమ్మ దేవాలయం నుంచి గ్రామ పెద్దలు, గ్రామ పురోహితులు, కొందరు ప్రజలు తీసుకొస్తున్నారు ). శ్రీ భావన్నారయన స్వామివారిని దక్షిణాభిముఖం గా స్వామివారికి ఎడమ వైపు ప్రత్యేక ఆలయం నిర్మాణం చేసి అందులో శ్రీ సోమేస్వర స్వామిని తూర్పుముఖంగాను ప్రతిష్ఠించి సివద్రుష్టికి గాను ఆలయమ గోడకు రంధ్రములు వదిలి గుడి నిర్మించారు
క్రిమికంఠచోళుడు
క్రీ.శ. 594 సం|| లో భావనారాయణ స్వామి వారిని క్రిమికంఠ చోళ చక్రవర్తి ప్రతిష్ట చేసెనట్లు స్దల పురాణము, స్దానిక కైఫీయతు తెలుపుతున్నప్పటికీ ఆ పేరుగల చక్రవర్తి చరిత్ర పుటల్లో లభ్యం కారేదు. శైవ, వైష్ణవ ఆచారాల మద్య ఆధిపత్య పోరు జరుగుతున్న 11వ శరాబ్దంలో శైవుదైన మొదటి కులోత్తింగుడు [శ్రీ.శ. 1070-1120] వైష్ణవుడైన రామానుజాచార్యుల వారిని [1016-1137] పీడించడంతో రామానుజాచార్యుల వారు చిదంబరం గుడిలోని గోవిం రాజస్వామి విగ్రహాన్ని, ఉత్సవ విగ్రహాలను తిరుపతి [క్రొత్తూరు] కి తరలించారు. ఐతే అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఎర్పడడంతో అక్కడినుంచి కర్ణాటక దేశానికి తరలి, మాంద్యా సమీపంలోని మేల్కోంటే [తిరునారాయణపురం] లో తలదాచుకున్నారు. రామానుజాచార్యుల వారిని ఆవిధంగా పీడించిన మొదటి కులోత్తుంగుడిని వైష్ణవ వాజ్ఞ్యం "క్రిమికంఠ చోళుడు" అని నీచంగా అభివర్ణించింది. ఐతే అధిరాజేంద్ర చోళ రాజే [క్ర.శ 1070] క్రిమికంఠచోళుడు కావచ్చనే అభిప్రాయం కూడా చరిత్రకరుల్లో ఉంది. కాని స్దల పురాణం ప్రకారం ఆలయన్ని నిర్మించిన రాజు 6వ శతాబ్దినాటి క్రిమికంఠచోళుడు. కాగా వైస్ణవులచే క్రిమికంఠునిగా అభివర్ణించబడ్డవాడు 11వ శతాబ్దానికి చెదిన మొదటి కులోత్తుంగుడు [లేదా అధిరాజేంద్రుడు] ఈ ఇద్దరి చోళ రాజుల నదుమ ఐదు శతాబ్దాలకు పైగా అంతరం స్పష్టంగా కనిపిస్తుండడంతో చారిత్రక ఆధారాల్లో కొంత అస్పష్టత ఏర్పడింది. ఏదేమైనా చరిత్రకు అందని అనేక సాక్ష్యాధారాల వలనే క్రీ.శ. 594 సం|| నాటి ఆలయ నిద్మాణ ప్రారంభోర్సవ అధికారిక శాసనాధారాలు లభించలేదు.
1110 సం|| లో వేర ప్రతాప శూర మహామందలేశ్వర బల్లియ చోళ మహరాజు పట్టాభిషిక్తుడైన తరువాత భావనారాయణ స్వామి వారి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వర్షోత్సవ, తిరుపావళి మొదలైన ఉత్సవాలు జరిపించి, గ్రామం నలుదిక్కులా పొలిమేర చిన్నెలు ఏర్పాటుచ్చేశాడు. తూర్పున "వెలిచర్ల" అను గ్రామన్ని దక్షిణాన బంగాళాఖారమును, నైఋతి దశన "మోటుపల్లి" అను రేవు పట్టణమును, పశ్చిమాన "ఉప్పుటూరు" [లవణపురి] ను, వాయవ్యమున "పోతుకట్ల" [పోతినేనివారిపాలెం], ఉత్తరాన రేటూరును, ఈశాన్యమున "పూండ్ల", "అప్పికట్ల"ను పొలిమేరలుగా ఏర్పరిచాడు.
క్రీ.శ. 1136 లో గజపతి వారసుదైన గజపతి మహరాజు ఈ రాజ్యాన్ని అక్రమించి పాలించే కాలంలో వీరి ప్రధానియైన గోపరాజు రామన్న బాపట్ల వారికి, దేశిరాజు వారికి, ఆముదాలపల్లి వారికి, శిఖరం వారికి, స్దానం వారికి శూద్రులలో శిఖరం వరికి మొత్తం ఆరు సంతుల వారికి గ్రామ మిరాశీలు ఏర్పాటుచేశాడు. కుమార కాకతీయ రుద్రదేవ మహారాజు 1319 ప్రాంతంలో పాలించిన తరువాత రెండవ ప్రతాపరుద్రుని అనంతరం రెడ్డి రాజులు పాలనలోకి వచ్చారు. 1325 లో ప్రోలయ వేఆరెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్దాపించాక పలువురు రెడ్డి రాజులు 1424 వరకు పాలించారు. వీరి తర్వాతి పాలకుడైన వీరభద్ర గజపతిని, అనంతరం కొండవీటి దుత్గాన్ని 1515 లో శ్రీకృష్ణదేవరాయలు జయించాడు. తరువాత అచ్యుతరాయలు, సదాశివరాయలు, రామరాయలు, తిరమలరాయలు, శ్రీరంగరాయలు మొదలగు రాజులు 1565 వరకు పాలించారు. తరువాత తురుఘ్కలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. వేరిలో నాసర్ జంగ్ ఈ సర్కారులను ఫ్రించివారికి విక్రయించాడు. ఫెంచివారు పరిపాలించిన ఏడు సంవత్సరాలలో చివరి సంవర్సరమైన 1758లో వీరు అష్ట దిక్కులందున్న శక్త్యాలయాలను ధ్వంసం చేశారు. భావనారాయణ స్వామి దేవాలయంలో విధ్వంసం సృష్టించరు. ఈ దురంతంతో స్వామివారికి ఏడాదిపాటు పూజాదులు జరగలేదు.
తదుపరి ఈ పట్టణం 1759లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి పరిపాలనలోకి రావడంతో ఆ కాలంలో వారి దివాను గారిన రాజమండ్రికి చెదిన శ్రీ రాజా కాండ్రేగుల జోగీ జగన్నాధరావు బహదూరు గారు తన పర్యటనలో బాపట్లకు విచ్చేసి మూలవిరాట్టు పునఃప్రతిపి, మరలా నిత్య నైవేద్య దేపారాధనలు జరిగేటట్లు ఏర్పాట్లు కావించారు. అత్చనాదులు నిర్వహించడానికై గౌతమస గోత్రులైన శ్రీమాన్ నల్లూరి నరసిం హాచార్యులు భర్గవస గోత్రులైన శ్రీమన్ శ్రీనివాసుల భావనారాయణగార్లను నియమించారు. అంతేకాకుండా శ్రీవారి దేవాలయములోనున్న శ్రీ సోమేశ్వర స్వామి వారికి నూతన ఆలయాన్ని ఏర్పాటుచేయదలచి, ఆలయంలోని తూత్పు భాగమున 50 మీ. దూరంలో ఒక నూతన ఆలయాన్ని నిర్మించి అందులో ప్రాజ్ఞ్మ్ ఖంగా ప్రతిష్టించి నిత్య నైవేద్య దీపారాధనలకు పుర్తి ఏర్పాట్లు చెయించారు.స్వామి వారి కైంఠకర్యమునకు స్వర్ణబ్రహ్మన్న అను శివద్వజుని నియమించారు.
1803 వరకు జగన్నాధరావు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా తన భాధ్యతలను ఎంతో సమత్దవంతంగా నిర్వహించిన తరువాత ప్రభుత్వము సర్కారీ వేలము వేయగా శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు [1761-1816] ఈ ప్రాంతాన్ని కొని అమరావతి రాజధానిగా 1811 వరకు అత్యంత సార్దవంతంగా పాలించారు. శ్రీ రాజా వారు స్వామి వారికి ఎన్నో సేవలు చేసి, ఎన్నో కానుకలు అందించారు. వీరు ఆలయ ధర్మకర్తృత్వమును విరమించుకున్న పిదప అర్చక స్వాములు పూర్వము సోమేశ్వర స్వామివారు
వేంచేసియున్న చోట గోదాదేవిని ప్రతిష్టించారు. శ్రీ వీరభోగ జ్వాలా నరసిం హ స్వామి దేవాలయాని కి కుడి ప్రక్కన శ్రీ తాలూకాకి తహసీల్దరుగా వచ్చిన వింజమూరు వేంకటరావు పంతులు గారు దేవాలయ స్దితిగతులను పరిశీలించి ఉత్సవాలను ఘనంగా జరిపించారు.
కైఫియ్యత్తులో వివరింపబడిన పై వివరణకు, నేటి వరకు లభ్యమైన ఇతర చారిత్రక ఆధారాలకు మద్య కొంత వ్యత్యాసముండడంతో ఆలయ సమగ్ర చరిత్రలో కొంత అస్పష్టత గోచరిస్తుది. కులోత్త్తుంగ చోళుదు పేరు మీద ముగ్గురు చక్రవర్తూ ఉండదం [మొదటి కులోత్తుంగుడు ఖ్రీ.శ. 1070 నుండి 1120 వరకు, రెండవ కులోత్తుంగుడు క్రీ.శ. 1135 నుంది1150 వరకు] వారి పరిపాలనా కాలాల్లో చరిత్రకారుల్లో స్వల్ప భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడతోపాటు కైఫియ్యత్తులను గ్రామ కరణాలు ఇతర గ్రామ పెద్దలు కలిసె ఆధారరహితంగా నిర్ణయించినవి కావడమే ఈ అస్పష్టతకు కారణం..
భిన్న సంప్రదాయాల విశాల భారతావని ఒక్కో ప్రాంతంలో ఒక్కో శైలిని దేవాలయల నిర్మాణాల ద్వారా తెలియజేస్తుండడంతో ఈ నిర్మాణాలు సంస్కృతీ సంప్రదాయాలపరంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్దానంలో నిలబెట్టాయి. కాబట్టే ప్రపంచ పర్యాటక రంగంలో మన దేవాలయాలకు ప్రముఖ స్దానం లభించింది. భారతీయ కళకు, తద్వారా భారతీయ సంస్కృతికి సోపానాలుగా నిలుస్తున్న అనేక దేవాలయాల కోవలోనే పలుచారిత్రకాంశాలకు, లలిత కళలకు సజీవ సాక్ష్యం గా నిలుస్తోంది. బాపట్ల భావనారాయణ స్వామి దేవాలయం.
దక్షిణ దిక్కుకు అభిముఖంగా 19.85ని25.85 మీటర్ల విస్తీర్ణంతో సమచతురస్రాకారంలో నిర్మించబడిన ఈ ఆలయ నిర్మాణంలో తెలుగు చోళుల శైలి అణువణువునా సందర్శకులకు కనువిందు చేస్తుంది.ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అత్యంత వైభవంగా నిలువెత్తున నిలిచిన గాలిగోపురం మహద్వారమై సందర్శకులకు మహా స్వాగతం పలుకుతూ ఆలయంలోకి ప్రవేశించిన ప్రతి పర్యాటకునికీ అనిర్వచనీయమైన భావన కలిగిస్తుంది. ఈ మహద్వార గోపురం ద్వారా లోపలకు ప్రవేశించగానే కనిపించే బలిపీఠం, కీర్తి ధ్వజ స్తంభం,జీవ ధ్వజ స్తంభాలతో ఆలరారే విశాలమైన ప్రాంగణం, ప్రాంగణంలో ద్వితలంగా చరిత్రకు సజీవ సాక్ష్యమై శోభాయమానంగా వెలుగురున్న ఆలయం, ఆలయం చుట్టూ నిర్మించబడిన విశాలమైన ప్రాకారం మరింత ఆహ్లాదాన్నిస్తాయి. ప్రాంగణంలోకి ప్రవేశించిన పిదప ఎడమవైపున నిర్మించబడిన మంచి నీటి బావి వద్ద పాద ప్రక్షాళన కావించి, ముఖమండపం ద్వారా ఆంతరాలయంలోకి ప్రవేశించి, అర్దమండపం ద్వారా గర్భాలయంలోకి దృష్టిసారిస్తే దర్శన భాగ్యం లభిస్తుంది. "విమానార్చనకల్ప"లో శ్రీమన్నరాయణుడు నాలుగు హస్తాలను కలిగివుంతాదని అభివర్ణించబడింది. అదే రీతిలో శ్రీ భావనారాయణుదు వెనకవైపు కుడి చేయి కమల హస్తంగా, ముందు వైపు ఎడమ చేయి కఠి హస్తంగా భక్తకోటికి దర్శనభాగ్యన్ని కల్పిస్తున్నాయి. అంతరాలయం లో అంజనేయ స్వామి, పడమరన కేశవస్వామి విగ్రహాలను తూర్పు ముఖంగాను, స్వామి వారి పర్యంక మందిరము, ఆసీన రీతిలోని రాజ్యలక్ష్మీ అమ్మవారు, విఖనసాచార్యులు, రంగనాధ స్వామి, సమభంగ స్దానక రీతిలోని గోదాదేవి, స్దానక రీతిలోని కోదండ రామస్వామి, ఆసీన రీతిలోని వీర భోగ జ్వాలా నరసిం హ స్వామి, 10 మంది ఆళ్వారులతో శ్రిరామానుజాచార్యులు మరియు 112 గ్రంధాలకు పైగా శ్రీ వైష్ణవ గ్రంధాలను రచిచిన "కవితార్కికకేసరి" బిరుదాంకితులైన వేదాంత దేశికుల వారితో తిరుచుట్టు మాలిక అలంకరంపబదగా కేంద్రస్దానంలో స్వామివారి దివ్వ స్వరూపం అఖిలాండ కోటికి అనంత వరాల జల్లులను కురిపిస్తూ దివ్వ ప్రకాశాలను వెదజల్లుతుంటుంది. ప్రతిఫ్టా కాలంలో తొలుత శ్రీ భవనారాయణ స్వామి వారితోపాటు ఈశానంలో శ్రీ సోమేశ్వరస్వామిని తూత్పుముఖంగాను, ఆగ్నేయంగా శంఖచక్రాభరణాలతో కూడిన శ్రీ వీర భోగ యోగ జ్వాలా నరసిం హ స్వామిని పశ్చిమముఖంగాను, నైఋతియందు శాంతముర్తి శ్రీ కేశవ స్వామిని తూర్పుముఖంగాను
శాసనాలలో అధిక భాగ అఖండ దీప దాన శాసాలు కావడం విశేషం. ఈ దానాలన్ని పండుగ దినాల్లో చేయబడినవి. 66 శాసనాల్లో ఈ విషయంస్పష్టంగా లిఖించబడినది. 18శాసనాల్లో దానాలు ఉత్తర సంక్రాంతినాడు వేయించినట్లు వివరింపబడగా ఒక శాసనం దక్షిణాయన సంక్రాంతి పర్వ దినాన వేయించినట్లు తెలుపుతుంది. 6 విష్ణు సంక్రాంతి సందర్భంగాను, 4 సూఅర్యగ్రహణం సందర్భంగాను, 1 చంద్రగ్రహణం సందర్భంగానూ వేయించబదినవి. 6 అమావస్య దినం సందర్భంగను, 10 దాన శాసనాలు పౌర్ణమి సందర్భంగనూ వేయించబడినవి. కగా 9 శాసనలు ఏకాదశి సందర్భంగా ప్రతిష్టించబడిన దాన శాసనాలు. అందులో 5 లొలి ఏకాదశిని వాయవ్వంలో అభయ వరద ముద్రలతో దక్షిణ దిక్కుకు అభిముఖంగా శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీ తాయారును మాత్రమే ప్రతిష్టించడం జరిగింది. కాలానుగతంగా ఈశాన్యంలో శ్రీభూసహితముగా రంగనాధుని ప్రతిష్టించారు. రంగనాధుని నాభిజనితునిగా బ్రహ్మదేవుడిని దక్షిణాభిముఖంగాను, అనంతుని పాంపుగాను, పాదాల వద్ద పశ్చిమాభిముఖంగా మధుకైటభులను, క్రిమిదంఠ చోళరాజు సుధామూర్తులను వారిని, వారి ముందు భృగు మరియు అత్రి మహర్షులను తుర్పుముఖంగాను మరీచి మరియు కశ్వప మహర్షులను పశ్చిమముఖంగానూ ప్రతిష్టించారు శ్రీ భావనారాయణుడు స్వామి వారి ఆలయంలోని శ్రీ సోమేశ్వరస్వామి వారిని ప్రత్యేక ఆలయంలో ప్రతిష్టించిన తరువాత ఆ ఆలయంలో అర్చక స్వాములు శ్రీ గోదాదేవిని తూర్పుముఖంగా ప్రతిష్టించారు. అదే సమయంలో శ్రీ జ్వాలా నరసిం హస్వామికి కుడి భాగంలో శ్రీ సీతా లక్ష్మణ స్మేత శ్రీ కోదండ తాములస్వామి వారిని పశ్చిమాభిముఖంగా ప్రతిష్టించారు.కేశవ స్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారు, నరసిం హస్వామి మరియు గోదాదేవి ఆలయాల మీద ప్రత్యేకంగా నిర్మించబడిన నాలుగు గోపురాలు ఆలయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచాయి. గోదాదేవి ఆలయం మీద నిర్మించనడిన గోపురం క్రిమికంఠ చోళుడు నిర్మించినది కాగా మిగిలిన మూడు గోపురాలు జగన్నాధరావు పంతులు గారు శివాలయాన్ని నిర్మించే సమయంలో 18వ శతాబ్డంలో నిర్మించినవి. వాయవ్యమూలంగా దక్షిణానికి అభిముఖంగా శ్రీ విఖనసాచార్యుల వారి మందితంలో విఖనసులతోపాటు భృగు, మరీచి, అత్రి మరియు కశ్యప ఋషులు అసీనులై ఉండడం వేదకాలం నాటి సంస్కృతిని తలపిస్తుండగా ఆగ్నేయాన గల గదిలోని అళ్వారుల విగ్రహాలు ఈ ఆలయానికీ, శ్రీ వైష్ణవానికి గల అనుబంధాన్ని తెలుపుతున్నాయి. ఆళ్వారులలో పూదత్త అళ్వారు, పెతియాళ్వారులలో [గోదాదేవి తండ్రి] తొందరది ప్పొడి ఆళ్వారు [విప్రనారాయణ] పేయాళ్వారు, తిరుప్పణియాళ్వారు, మధురకవి ఆళ్వారు, తిరుమలిశై, కులశేఖర, పోగైయాళ్వారులు పద్మాసనంలో ఆశీనులైయుండగా తొరుమంగై ఆళ్వారు ప్రతిమ ఖడ్గం, డాలు ధరించి నిలబడి ఉంటుంది. వివిధ కులాలకు చెందిన 12 మంది ఈ ఆళ్వారులు సంస్కృతంతోపాటు, పామరులకు అర్దమయ్యేందుకు వీలుగా తమిళంలో శ్లోకాలు రచించారు. విశిష్టాద్వైతానికి విశిష్ట రూపాన్ని కల్పించారు.
పాదబంధ అధష్ఠానం గల ఆలయ కుడ్య భాగంలో 5 దేవకోష్ఠాలు [గూళ్ళు] కోష్ఠాలపైన గల మకర చిత్ర తోరణాలు, బ్రహ్మకాంత కుడ్య స్తంభాల్లు చోళ శైలిని పోలివుంటాయి. ఒకప్పుడు ప్రతి కోష్ఠంలోనూ స్వామి వారి ప్రతిమ ఉండేది. ఫ్రెంచివారు వాటిని ద్వంసం చేసెన తరువాత మరలా ప్రతిమలు ఏర్పాటు చేయబడలేదు. కుట, శాల, పంజర హారములతో కూడిన ఏకతల విమానము, గర్భగుడి, ముఖమండప ద్వారాల దగ్గర గల ద్వారపాలక విగ్రహాలు, అర్దాండప ద్వార బంఢాలపై చిత్రంచబదిన పురాణ ఘట్టాలు, పలు కుడ్య చిత్రాలు, ద్వార తోరణాలు, చిత్ర తోరణాలు, స్తంభ తోరణాలు వంటి కళాత్మక అలంకరణలు ఆలయ అందాన్ని ఇనుమడింపజేస్తూ నటి శిల్ప కళా చాతుర్యానికి మచ్చుతునకలుగా నిలుస్తునాయి.
శిఖరం
దక్షిణ భారత దేవాలయ నిర్మాణ శైలిలో ఐదు దశల్లో నిర్మించబడ్డ ఈ దేవాలయ నిర్మాణం మరో విశిష్టతతో కూడివుంది. దేవాలయం గర్భగుడి విమానం కూడా కొండరాతితో నిర్మితం కావడమే ఆ విశెష్టత, గర్భాలయానికి పైన అష్టభూజాకృతిలో నిర్మించబడ్డ ఆలయ శిఖరం [అమలకం] ద్వితలంగా నిర్మించబడి, 24 పద్మ పత్రాలతో చుట్టబడి ఉంటుంది. శిఖరానికి పైభాగాన గుండ్రని శ్తూపము, దాని ఆగ్రభాగాన రాగితో చేయబడిన చక్రాభరణంతో కూడిన కలశం [స్తూపి] కలశం క్రింది భాగాన నాట్య భంగిమలతో కూడిన చిత్రాలు మరింత వన్నె చేకూరుస్తూ ఉంటాయి.

శాసనాధారములు
"శసనం రాజదత్తోర్వ్యాలేఖాజ్ఞ శాస్త్రశాంతిషు - అనగా రాజులచే ఇతరులకు ఈయబడిన భూమిని గురించిన వ్రాత, ఆజ్ఞ, శాస్త్రము, శాంతి వాక్య మే శాసనము అని అర్ధం, పూర్వపు రాజులు, ప్రెగ్గడలు [ప్రధాన పురుషులు] ధనవంతులు తాము దానమిచిన భూములు మరియు ఇతర వివరములు భావి తరాలకు తెలియాలనే తలంపుతో అవి శాశ్వతంగా నిలిచిపోయేందుకు ఆయా వివరాలను శిలల మీద,తామ్రపత్రాల పైన, బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము మరియు తాళపత్రాల పైన లిఖింపజేశారు. ముఖ్యంగా ఈ శాసనాలు భాషకు మహోపకారం చేశాయని చెప్పవచ్చు. తెలుగు భాషలో మహభారత రచనకు ఈ శాసన భాషే మూలాధారమున్న విషయం సర్వవిదితమే. అంతేకాకుండా శాసనాల వలన ఆనాటి ప్రజల భాష, ఆచార వ్యవహారములు, మత సంప్రదాయాలు, రాజకీయ చరిత్ర సాంఘిక జీవనము మొదలైనవి తెలుస్తాయి. ముఖ్యంగా కీ.శ. 13వ శతాబ్దానికి ముందు చరిత్రను తెలుసుకోడానికి శాసనాలే ముఖ్యాధారాలయ్యాయి. భావనారాయణ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించబడిన అనేక శాసనాలు క్కూడా నాటి సాంఘిక స్దితిగతులను తెలియజేస్తూ గత వైభవానికి సాక్షీభూతంగా నిలుస్తూన్నాయి.

చోళ చాళుక్కుల కాలంలో ఈ ప్రాతం మండలంలోని ప్రధమ అంతర్భగంగా ఉన్నట్లుగా "ఉత్తమ చోడవరనాటి కమ్మనాటి ప్రేంపలి శ్రీ భావనారాయణ దేవర అను శాసనం సూచిస్తున్నది. స్వామివారు "భావనారాయణ స్వామి "గాను, "భావజనర్దనుడు" గాను భాసూరేశ్వరుడు" గాను "భావడేవుడు" గాను "భావ" గాను పలు నామాలతో కేర్తించబడినట్లు అనేక శాసనాలు వెల్లడిచేస్తునాయి.
భావనారాయణ స్వామి వారి దేవాలయంలో పలువురు చక్రవర్తులు, ఇతర దాతలు తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడ భాషల్లో వేయించిన శాసనాలు 76 వరకు ఉన్నాయి. ఈ శాసనాల ద్వారా ఆలయ చరిత్ర, ఆలయ నిర్వహణ ఆర్దిక వ్యవహరాలు, నిత్యర్చన మరియు సేవలతోపాటు నాటి సామాజిక వ్యవస్ద, వ్యవస్దకు దేవాలయంతో ఉన్న అనుబంధం గురించిన వివరాలు తెలుస్తున్నాయి. వీటిలో మొట్టమొదటి శాసనము క్రీ.శ. 1023లో గర్భాలయం కుడ్యం మీద ప్రతిష్టించబడింది. చివరి వైపున శాసనము క్రీ.శ. 1518 నాటిది. ఇది ముఖమండపమునకు కుడి నైపున దక్షిణ దిక్కుగా ప్రతిష్టించబడింది. మొదటి శాసనమును శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది.
ఆలయ నిర్మాణం క్రీ.శ. 594లో [6వ శతాబ్దంలో] జరిగినట్టు స్దల పురాణం తెలుపుతునప్పటికీ ఆ శతాబ్దం నాటి శాసనం ఒక్కటి కూడా ఇక్కడ లభ్యం కాలేదు. చాలా శాసనాలు 12 మరియు 13వ శతాబ్దాలకు చెందినవి కాగా, 14 మరియు 15 శతాహ్దాల నాడు అసలు శాసనాలే వేయబడలేదు.12వ శతాబ్దిలో 54 1\2 అఖండ దీపాలు సమర్పించబడగా, 13వ శతాబ్దిలో 2 దీపాలు మత్రమే సమర్పించబడ్డాయి. అఖండ దీపారాధనకు అవసరమయ్యే నేతికిగాను భక్తులు ఆలయానికి 18 సందర్భాలలో ఆవులు, మేకలు, గొర్రెలను దానమిచ్చారు. 12వ శతాబ్దిలో 37 సందర్భాల్లొ ధనాన్ని సమర్పించారు. నాడు ధనం మాడల రూపంలో ఉండేది. ఈ మాడలు బిరుదు మాడలుగాను, ఉత్తమఘండ మాడలుగాను, చామర మాడలుగాను, గ్రంధహస్తి మాడల రూపంలోనూ ఉండేవి. ఒక అఖండ దీపం వెలుగించేందుకు అవసరమయ్యే నెయ్యికిగాను ఇవ్వవలసిన కనీస మాడాల సంఖ్య 12గా నిర్ణయించబడినట్లు 1143 సం|| తర్వాతి శాసనాల ద్వారా తెలుస్తున్నది. 1145 లో మేడాసాని అనే భక్తురాలు సూర్యగ్రహణ నిమిత్తం ఒక అఖండ దీపానికి 17 బిరుదు, మాడలు దానమివ్వగా, కులోత్తుంగ చోడ గాంగేయరాయ సమయ సేనాధిపతియైన కన్నిశెట్టి 1149లో ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తంగా అఖండ దీపానికిగాను 13 బిరుదు మాడలను జక్కన అనే భక్తుడు 1156 లో సూర్యగ్రహణ నిమిత్తం అఖండవర్తి దీపానికి 12 బిరుదు మాడలను సమర్పించి, జక్కన దానం చేసిన 12 బిరుదు మాడలకు ఐదుగురు బాధ్య త వహించి, నిత్యం ఒక మానెడు నేయి యవలసిందిగా నిర్ణ ఇంచబడింది. పెర్మాడి పండితులు 25 రూకలు, సబ్బన పండిరులు 25 రూకలు, బావన 25 రూకలు, మాంకన భట్లు 25 రూకలు, భండారి ఎఱపోతు [కోశాధికారి] 20 రూకలుగా పంచి ఈ నిర్ణయం చేయబడింది. ఇతని శాసనం ద్వారా ఒక మాడ విలువ పది రూకలతో సమానమని తెలుస్తున్నది. మొత్తం 76 శాసనాల్లో 45 శాసనాలు కేవలం అఖండ దీప నైవేద్యం గురించి వేయించినవే కావడంతో ఈ ఆలయం అఖండ దీప కాంతులతో నిత్యం అత్యంత వైభవంగా అలరారుతూ ఉండేదని తెలుస్తున్నది.
8 శాసనాలు స్దానిక పరిపాలకులైన మహమండలేశ్వర పినమల్లిదేవ చోడ మహరాజు, మహమండలేశ్వర కన్నరదేవర చోడ, మహామండలేశ్వర కడియాల రాజు, మహామండలిక భీమనాయక, మహామండలేశ్వర రాజేంద్ర కోన లోకరాజు జిక్కిడిదేవ చోడ, చోడ భల్లయ మహారాజు మరియు కొల్లూరు ప్రధాన పాలకుడైన భేమానాయకుడు వేయించినవి. వీరేకాకుండ పలువురు రాజ వంశాలకు చెందిన స్ర్తీలు కూడా ప్రత్యేక దానాలు చేసేటట్లు శాసనాలు తెలుపుతున్నాయి. భూలోకమల్ల సోమేశ్వర చక్రవర్తి పాలించుచుండగా వేలనాటి మొదటి చోడయ మహారాజు భర్య సూరమదేవి మార్చి 29, 1130 సం|| శనివారము నాడు వ్యతీపాత నిమిత్తమున భావనారాయణ దేవరకు దీపదానం చేసింది. క్రీ.శ. 11135లో భళ్ళయ చోళ మహారాజు భార్య పొన్నమదేవి 6 చామర మాడలు దానము చేయగా, మొదటి గొంక రాజు భార్య గుండాంబిక, శ్రీ.శ. 1144 లో తెండవ గొంకరాజు భార్య సోమండియమ్మ తల్లి సూరాంబ, సోదరి ప్రోలాంబలు ప్రర్యేక దానాలు చేయగా క్రీ.శ. 1145 లో భీమనాయకుని భార్య మేడలాని అఖండవత్తి దీపమునకు బిరుదుమాడలు దానము చేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి.

శాసనాలలో అధిక భాగ అఖండ దీప దాన శాసాలు కావడం విశేషం. ఈ దానాలన్ని పండుగ దినాల్లో చేయబడినవి. 66 శాసనాల్లో ఈ విషయంస్పష్టంగా లిఖించబడినది. 18శాసనాల్లో దానాలు ఉత్తర సంక్రాంతినాడు వేయించినట్లు వివరింపబడగా ఒక శాసనం దక్షిణాయన సంక్రాంతి పర్వ దినాన వేయించినట్లు తెలుపుతుంది. 6 విష్ణు సంక్రాంతి సందర్భంగాను, 4 సూర్యగ్రహణం సందర్భంగాను, 1 చంద్రగ్రహణం సందర్భంగానూ వేయించబదినవి. 6 అమావస్య దినం సందర్భంగను, 10 దాన శాసనాలు పౌర్ణమి సందర్భంగనూ వేయించబడినవి. కాగా 9 శాసనలు ఏకాదశి సందర్భంగా ప్రతిష్టించబడిన దాన శాసనాలు. అందులో 5 లొలి ఏకాదశిని పురస్కరించుకొని ప్రతిష్టించబడినవి కావడం విశేషం. ఈ సాలనంలో మొదటిసారిగా శ్రీవైష్ణవుల ప్రస్తాపన రావడం విశేషం. ఈ శాసనాన్ని బట్టి ఈ ఆలయంలో క్రీ.శ. 1023 సం|| నుండి శ్రీవైష్ణవ అర్చక సంప్రదాయం నెలకొల్పబడినట్లు తెలుస్తుంది.
మాహామండలేశ్వర కన్నరదేవ చోడ మహరాజు క్రీ.శ. 1116లో వేయించ్న శాసనంలో దేవర వారికి కమ్మనాడులోని మధుకంబల్లి గ్రామాన్ని సర్వకర పరిహారంగా సమర్పించ్నట్లు తెలుపుతున్నది. 1142 నాటి ఒక శాసనం ద్వారా ఉభయ ఏకాదశులందు ఆలయంలో స్వామివారికి భువన విజయం చేయించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తున్నది.
ఆలయానికి అనుబంధంగా ఒక సత్రం ఉండేదని, 11వ శతాబ్ది నాటి ఒక శాసనంలో చౌడమయ్య అనే వ్యక్తి ముగ్గురు బ్రాహ్మణులకు నిత్య భోజనానికిగాను 16 గంధవారణ మాడలను సమర్పించగా, 12వ శతాబ్దం నాటి శాసనంలోమొదటి కులోత్తంగుని అధికారి ముదిగొండ బ్రహ్మమారాయణ్ ఇతర ప్రాంతాలనుండి వచ్చే బ్రాహ్మణులకు మధ్యాహ్న భోజన నిమిత్తం 30 రాజరాజ మాడలను దానం చేసినట్లు తెలుపబడింది.
పరిపాలనా యంత్రాంగం:- ఆలయ పరిపాలనా యంత్రాంగానికై కొందరు ఉద్యోగులు ఉద్దేశించబడ్డట్టు శాసనాల్లో తెలుపబడింది. ఈ ఉద్యోగులు ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వహించేవారు. స్దానపతి, దేవకర్మి, భండారి, శ్రీవైష్ణవులు, సానులు, పరిచారకులు, కాపులు, కరణాలు, మేల్నయకులు, పూజారులు, భోగపతులు, వృత్తిమంతులు అధికార వర్గానికి చెందిన ఉద్యోగులుగ ఈ శాసనాలు గెలుపుతున్నాయి.
స్దాన[నా]పతి;- ఇతడు భాహ్మణ వర్గానికి చెందినవాడు. ఆలయానికి ప్రధాన అధికారిగా ఉండేవాడు. దేవాలయ దాన ప్రయోజనాలను పర్యవేక్షించడం ఇతని విధి. 1110 నాతి శాసన వివరం ప్రకారం విష్ణువర్ధన పండితుడు, 1145 నాటి శాసనం ప్రకారం పండితుని కుమారుడైన గోకన పండితుడు, 1154 నాటి శాసనం ప్రకారం భావరాజు కుమారుడైన సుంకనభట్టు స్దానపతులుగా ఉన్నట్లు తెలుస్తొంది.
దేవకర్మిమాహామండలేశ్వర కన్నరదేవ చోడ మహరాజు క్రీ.శ. 1116లో వేయించ్న శాసనంలో దేవర వారికి కమ్మనాడులోని మధుకంబల్లి గ్రామాన్ని సర్వకర పరిహారంగా సమర్పించ్నట్లు తెలుపుతున్నది. 1142 నాటి ఒక శాసనం ద్వారా ఉభయ ఏకాదశులందు ఆలయంలో స్వామివారికి భువన విజయం చేయించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తున్నది.
ఆలయానికి అనుబంధంగా ఒక సత్రం ఉండేదని, 11వ శతాబ్ది నాటి ఒక శాసనంలో చౌడమయ్య అనే వ్యక్తి ముగ్గురు బ్రాహ్మణులకు నిత్య భోజనానికిగాను 16 గంధవారణ మాడలను సమర్పించగా, 12వ శతాబ్దం నాటి శాసనంలోమొదటి కులోత్తంగుని అధికారి ముదిగొండ బ్రహ్మమారాయణ్ ఇతర ప్రాంతాలనుండి వచ్చే బ్రాహ్మణులకు మధ్యాహ్న భోజన నిమిత్తం 30 రాజరాజ మాడలను దానం చేసినట్లు తెలుపబడింది.
పరిపాలనా యంత్రాంగం:- ఆలయ పరిపాలనా యంత్రాంగానికై కొందరు ఉద్యోగులు ఉద్దేశించబడ్డట్టు శాసనాల్లో తెలుపబడింది. ఈ ఉద్యోగులు ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వహించేవారు. స్దానపతి, దేవకర్మి, భండారి, శ్రీవైష్ణవులు, సానులు, పరిచారకులు, కాపులు, కరణాలు, మేల్నయకులు, పూజారులు, భోగపతులు, వృత్తిమంతులు అధికార వర్గానికి చెందిన ఉద్యోగులుగ ఈ శాసనాలు గెలుపుతున్నాయి.
స్దాన[నా]పతి;- ఇతడు భాహ్మణ వర్గానికి చెందినవాడు. ఆలయానికి ప్రధాన అధికారిగా ఉండేవాడు. దేవాలయ దాన ప్రయోజనాలను పర్యవేక్షించడం ఇతని విధి. 1110 నాతి శాసన వివరం ప్రకారం విష్ణువర్ధన పండితుడు, 1145 నాటి శాసనం ప్రకారం పండితుని కుమారుడైన గోకన పండితుడు, 1154 నాటి శాసనం ప్రకారం భావరాజు కుమారుడైన సుంకనభట్టు స్దానపతులుగా ఉన్నట్లు తెలుస్తొంది.
దేవకర్ముల గురించి 4 శాసనాల్లో వివరించబడింది. వీరు కూడా భాహ్మణవర్గానికి చెందిన వారేనని తెలుస్తున్నది. స్దానపతి తర్వాతి స్దానంలో దేవకర్మి ఉండేవాడు. దేవాలయ సంపద నిర్వహణ బాధ్యత ఇతడు వహించేవాడు. 1107 నాటి శాసనంలో దేవకర్మిగా భావనారాయణ బ్రహ్మమారాయరణ్ ఉన్నట్లు తెలుస్తుంది. 1156 నాటి శాసనం భావరాజు మతో కుమారుడైన గోకన దేవకర్మిగా వ్యవహరించినట్లు తెలుపుతున్నది.
భాండారి
దేవాలయ పాలనా యంత్రంగానికి సంబంధించిన వారిలో ఇతడిది మూడో స్దానం, ఆదాయ, వ్యయాల నిర్వహణ భాండారుల బాధ్యత. వీరు వృత్తిదారులు. వీరిని కోశాధికారులుగా వ్యవహరించవచ్చు. క్రీ.శ. 1152 నాటి శాసనంలో దామన పెగ్గడ అఖండవర్తి దీపమునకు బెట్టిన 12 బిరుదు మాడలను నాటి భాండారిగా బాధ్యతలు వహిస్తున్న కేతరాజు కుమారుడైన ఎఱపోతు అను వ్యక్తి నిత్యం మానెడు నేయి పోసినట్లు వెల్లడిచేస్తున్నది. క్రీ.శ. 1156 నాతి సాసనం కూడా భాండాటిగా ఎఱపోతు వ్యవహరించినట్లు తెలుపుతున్నది.అదేవిధంగా మధుసూదన, రాజనారాయణ, ఎర్నకొంబ మొదలగువారు కోశాధికారులుగా వ్యవహరించినట్లు తరువాతి కాలం నాటి శాసనాలు తెలుపుతున్నాయి. వేరు ఏ వర్గానికి చెందినవారో నిత్ణయించడం కష్టం.
దేవాలయ పాలనా యంత్రంగానికి సంబంధించిన వారిలో ఇతడిది మూడో స్దానం, ఆదాయ, వ్యయాల నిర్వహణ భాండారుల బాధ్యత. వీరు వృత్తిదారులు. వీరిని కోశాధికారులుగా వ్యవహరించవచ్చు. క్రీ.శ. 1152 నాటి శాసనంలో దామన పెగ్గడ అఖండవర్తి దీపమునకు బెట్టిన 12 బిరుదు మాడలను నాటి భాండారిగా బాధ్యతలు వహిస్తున్న కేతరాజు కుమారుడైన ఎఱపోతు అను వ్యక్తి నిత్యం మానెడు నేయి పోసినట్లు వెల్లడిచేస్తున్నది. క్రీ.శ. 1156 నాతి సాసనం కూడా భాండాటిగా ఎఱపోతు వ్యవహరించినట్లు తెలుపుతున్నది.అదేవిధంగా మధుసూదన, రాజనారాయణ, ఎర్నకొంబ మొదలగువారు కోశాధికారులుగా వ్యవహరించినట్లు తరువాతి కాలం నాటి శాసనాలు తెలుపుతున్నాయి. వేరు ఏ వర్గానికి చెందినవారో నిత్ణయించడం కష్టం.
దేవాలయానికి సంబంధించిన క్రీ.స. 1023 నాటి తొలి శాసనంలో వీరి గురించి ప్రస్తావన ఉంది. దీన్నినట్టి ఆలయానికీ, వీరికీ గల అనుబంధం ప్రగాఢమైందని తెలుస్తుంది. దేవాలయానికి దానంగా ఇవ్వబడ్డ గ్రామాల బాధ్యత వీరు వహించినట్లు క్రీ.శ. 1043 నాటి శాసనం తెలుపుతున్నది. అంతేకాకుండా శ్రీ వైష్ణవ ఆధికారిని గురించిన క్రీ.శ. 1107 నాటి శాసనంలో ఉండడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది.
పూజారులు
అధికారుల తర్వాత ఆలయ నిర్వహణ బాధ్యత వహించినవారు పూజారులు వీరి గురించి క్రీ.శ. 1210 నాటి శాసనంలో పీర్కొనబడింది. దానాల ద్వారా భూములు పొంది వాటి ద్వారా వచ్చే ఆదాయంపై వీరు జీవించేవారు.
పరిచారకులు
దేవాలయంలో వివిధ సేవలందించేదుకు పరిచారకు ఉండేవారు.ఈ పదవులు బ్రాహ్మణ వర్గానికి చెందినవనీ, ఇవి వారసత్వంగా సంక్రమించేవని తెలుస్తొంది. క్రీ.శ. 1073 నాటి శాసనం దామోదరుండు, కేతన, రాఘవ తదితర పరిచారకుల గురించి తెలుపుతుండగా క్రీ.శ. 1107 నాటి శాసనంలో మాధవ, భహ్మదేవ, నారాయణ, మ్రాసె, శ్రీధర అను ఐదుగురు పరిచారకులను తెలుపుతుంది. 1147, 1149, 1151 మరియు 1167 నాటి శాసనాల్లో 9 మంది పరిచారకులు గురించి వివరించబడింది.

సానులు
స్వామి సమక్షాన ఎంతో మంది సానులు తమ కళాభినయాలతో రంగభోగాన్ని ప్రదర్శిస్తూ అలరించేవారు. సానికి సంస్కృత రూపం "స్వామిని" సాని అనగా స్త్రీ నృత్య కళాకారిణి. వీరు దేవాలయం కొరకు ప్రత్యేకంగా దానమివ్వబడినవారు. ప్రతి దినం రంగమండపంలో తమ నాట్య విన్యాసంతో రంగభోగాన్ని ప్రదర్శించడం వీరి విధి. సూరవదారక, జిల్లవసూరక, ప్రోలవగోక, ఎరియవ కాటక, మ్రానవ సూరక అను సానుల గురించి క్రీ.శ. 1107 నాటి శాసనంలో తెలుపబడింది. కాగా ప్రధాన నర్తకిగా "ణావనారాయణ దేవర కొలువు సాని" ఉండేదని క్రీ.శ. 1167 సం|| నాతి శాసనం తెలుపుతున్నది. 14వ శతాబ్దంలో ప్రఖ్యాత నర్తకి, అపురూప సౌందర్యరాశి లకుమాదేవి ఈ క్షేత్రం నుండే కొండవీటి రెడ్డి రాజైన కుమారగిరిరెడ్డి ఆస్దాన నర్తకిగా ప్రవేశపెట్టబడింది సానులతోపాటు ఎందరో పురుష నృత్య కళాకారులు, గాయనీ గాయకులు, సకల విద్యా ప్రవీణులు స్వామి వారిసేవలో పునీతులైనట్లు కొన్ని శాసనాలు తెలుపుతున్నయి. మ్రానయాను పురుష నాట్య కళాకారుడి గురించి ఒక శాసనంలో పేర్కొనబడింది.

క్రీ.శ 1210 సం|| నాతి సాసనంలో కరణాల ప్రస్తాపన ఉండాగా క్రీ.శ. 1285 నాటి శాసనంలో భోగపతి గురించి వివరణ ఇవ్వబదింది. కాపులు, అంగారికలు, తిరుమేనుకావలు అను వారు రక్షక దళ సభ్యు సభ్యులుగాను పంచాచార్య దేవకర్ములు అను వివిధ వృత్తుల నిపుణులు, ఇతర సేవలందించేందుకు దేవభట్లు ఆలయానికి సేవకులుగా ఉన్నట్లు కొన్ని శాసనాల ద్వారా వెల్లడవుతున్నది.
సైనిక వృత్తి స్వీకరించిన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన వారి గురించి శాసనాల్లో తెలుపబడేవారు. వీరిలో మొదటి కులోత్తుంగుని అధికారియైన ముదిగొండ చోడ బ్రహ్మమారాయరు ప్రసెద్ది చెందిన వాడు. మరి కొన్ని శాసనాల ద్వారా సంధివిగ్రహ సోమనపెగ్గడ, కామనపెగ్గడ, రాజ్యదక్షమంత్రి, మూలబృత్య, కట్టూరవ, కావలియ మొదలగు అధికారులు మణిమాన్యాలతో ప్రభువుకు సేవ చేసుకొన్నట్లు తెలుస్తున్నది. కన్నిశెట్టి, నీలిశెట్టి అను వర్తకులు కూడా దానాలిచ్చినట్లు కొన్ని శాసనాల్లో వివరించబడింది. బోయలు, నాయకులు, తెలికలు, పంచానమువారు పాలుపంచుకున్నట్లు పలు శాసనాలు తెలుపుతున్నాయి.
ఐతే స్వామి వారికి నిత్యం జరుగుతూ ఉండే వివిధ సేవల గురించిగాని, ఉత్సవాలను గురించి తెలిపే శాసనముగానీ స్వామివారికి గల ఆభరణ సంపదను తెలిపే వివరాలుగానీ ఏ శాసనంలోనూ ఇవ్వబడలేదు.

దేవాలయ దక్షిణ ద్వార తూర్పు గోడ మీది శాసనము
కాలం: శ్రీశ.1518
శాసనమును శ్రీకృష్ణదేవరాయల వారి పుణ్యార్ధం మహా మంత్రి తిమ్మరుసు చంద్రగిరి మేళమ మంత్రి కుమారుడు మరియు ఉపప్రధాని అయిన సోమరసు ద్వారా వేయించాడు. చంద్రగ్రహణం సందర్భంగా భావదేవర వారికి తిమ్మరుసు మంత్రి 22 గోచర్మాల విస్తీర్ణంగల భూమిని, 333 ముద్రలు [నాణాలు] సమర్పించినట్లు ఈ శాసనము తెలుపుతున్నది.
స్రీగణాధిపతయే నమః భూతత్ధరంద్దర
గబ్భళ్నిబ్భర్ రతర ప్రత్యాకులోజ్జృంభణార
0భత్రస్ధనితంబ్బినీవతితు . . . 0బ్బేణ
సంభావితాన్ కన్నార్ టాధిపకృష్ణరాయ
నృపతేర్యస్య ప్రయాణోర్సవే భృతా నస్యహి
తానహో సుఖయతి ప్రస్ధాన బేరీరవః
అభవత్ర్పతీపవంశే ఖండ్డవో ధరణీవరా
హ బిరుదాంక్కమండ్డనః సకల ప్రధానగు
ణహౌరవో [0] న్నతః సచివోప్యద్దేహ ఇవసా
ళ్వతొమ్మ్మయః || శ్రీకృష్ణద్దేహ ఇవసా
ళ్వతిం మ్మయః శ్రీకృష్ణరాయ నరనా
యక శాసనేన మంత్రీశ్వరః సకిత సాళువ
తిమ్మ్ మయార్యః ఆహూయ చంద్రగిరి మే
ళమ మంత్రి సూసం సోమశన్ నామకమ వో చదుపప్రధానం || శాకే విష్ణు పదాభివే దవిపులా సంఖ్యాంక్కితే వర్సరే విఖ్యాతేబ హూధాన్యనామని శుభే శుక్రశ్య రాకాతిధౌసోమే శీరకరోపరాగసమయే శ్రీకృష్ణవేణ్యంభసిస్నారస్పంప్రతి కొండవీడు విషయే భాప[ట్ల] సంజ్ఞేపురే || భావనారాయణ ప్రీత్యై సపాదాద్ద్య తయాధిదం | వింశద్గోచమ్మన్ . . . . . . . వించిత్రమప్పిన్ తవాన [హో] మహారాజా - మహారాజా ధిరాజస్య రాజం న్య పరమేష్ఠినః పు [0] ణ్యాత్ధర్0 కృష్ణరాయస్య వేణుపత్యా చ సం యుత0 || ఇత్ధం సాళువ తిం మయేన కృతినా శ్రీ కృష్ణరాయ ప్రభో రాజ్ఞాపాలన తత్పరేణ కధితస్సోమశన్ మంత్రీస్వర | ముద్రాణాం చ్చశరత్రయం త్రి సహిత త్రింశత్సమేతేం కృతీ ధారీకృత్య కరం నృపాల భవనే ప్రాదాదివం శాసనం || ద [త్తం] చంద్రొపరాణా సమస్తవి భవాయచ పాలయంత్తు మహపాలా క్షేత్రమాచద్రతారకం || ఇద [0] కొనికొన విశ్వనాధ భట్టు విరచితం || మద్వంశజాః పరమ హీపతి వంశజా వాయే వంశజా సతతము జ్వల ధర్మచిత్తాః మద్దరమ్య ఏవ పరిపాలన మాచిరంతి తద్యాద పద్మ యుగళం శెరసా వహామి || యీ ధర్మము పాలించిన వారు సోమరుశైయ | కొమారులు చినతి [రు] మ లైయ || శ్రీశ్రీశ్రీ భావనారాయాణ కాలం: శ్రీశ.1518
శాసనమును శ్రీకృష్ణదేవరాయల వారి పుణ్యార్ధం మహా మంత్రి తిమ్మరుసు చంద్రగిరి మేళమ మంత్రి కుమారుడు మరియు ఉపప్రధాని అయిన సోమరసు ద్వారా వేయించాడు. చంద్రగ్రహణం సందర్భంగా భావదేవర వారికి తిమ్మరుసు మంత్రి 22 గోచర్మాల విస్తీర్ణంగల భూమిని, 333 ముద్రలు [నాణాలు] సమర్పించినట్లు ఈ శాసనము తెలుపుతున్నది.
స్రీగణాధిపతయే నమః భూతత్ధరంద్దర
గబ్భళ్నిబ్భర్ రతర ప్రత్యాకులోజ్జృంభణార
0భత్రస్ధనితంబ్బినీవతితు . . . 0బ్బేణ
సంభావితాన్ కన్నార్ టాధిపకృష్ణరాయ
నృపతేర్యస్య ప్రయాణోర్సవే భృతా నస్యహి
తానహో సుఖయతి ప్రస్ధాన బేరీరవః
అభవత్ర్పతీపవంశే ఖండ్డవో ధరణీవరా
హ బిరుదాంక్కమండ్డనః సకల ప్రధానగు
ణహౌరవో [0] న్నతః సచివోప్యద్దేహ ఇవసా
ళ్వతొమ్మ్మయః || శ్రీకృష్ణద్దేహ ఇవసా
ళ్వతిం మ్మయః శ్రీకృష్ణరాయ నరనా
యక శాసనేన మంత్రీశ్వరః సకిత సాళువ
తిమ్మ్ మయార్యః ఆహూయ చంద్రగిరి మే
ఈ శాసనంలోని నెలవంక , సూర్యుడు చిహ్నాలు సూర్యచంద్రులున్నంత వరకు అన్న భావనను తెలియజేస్తుండగా, శంఖ్ చక్రాలు శ్రీవైష్ణవ సంప్రదాయానికి సూచికగా నిలుస్తున్నాయి. దేవాలయంలో ప్రేంపల్లి, భావపట్టణ బ్రహ్మపల్లి అను పేత్లతో పలు శాసనాలున్నా ఈ ఒక్క పై శాసనములో మాత్రమే "బాపట్ల" అను పేరు కనపడుతుంది. ఆలయ ముక్షపండపానికి కుడి వైపున తూర్పు గోడ మీద ఈ శాసనాన్ని గమనించవచ్చు. కాగా ఈ శాసనము వలన నాడు బాపట్ల కొండావీడు ప్రాంతములోనిదని తెలియుచున్నది.
సతి శాసనము
భావనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠించబడిన శాసనాల్లో అత్యంత విలక్షణమైనది "సతీ సహగమనము" గురించి తెలిపే శాసనము. ఈ శాసనము. ఈ శాసనము క్రీ.శ. 1210లో ప్రతిష్ఠించబడింది.

శాసనపాఠము:
స్వస్తి శ్రీమతు నిడుంబ్రోలి కొట్టారు యేతమనాయకుని కొ . . . . . . . . . . సానిపురుషునితోంగూడ శెవలోకము చె . . . ఆ . . కు ధమ్ముర్ వు నాను మారినాయకుణ్ణు ప్రెంపల్లి భావనారాయ-
. . . దీపము పెట్టించెను శకవషర్ ంబులు 1132 నేంట్టి మేషవిషువునాండు శ్రీమన్మహామండలేశ్వర కులోత్తుంగ ప్రిధ్వీ[గొం]క మహారాజుల చెలియలు అక్కమమ మాదేవి కొడుకు చోడగొంక మహారాజు ప్రిధ్వీరాజ్యము సేయంగా . . ఇచిన [.........] ఎంభది ఈ ఎడ్లెంభయి [1] వీని గుండని సూరెబోయిని కొడ్కు ప్రోలెబో -
యుండు అతని కొడ్కు . . . . 0డు ఈ వంశము వారి వంశము వారి వంశమున అఖండదీ పావ . . . .వోయ సమప్పిర్ ంచి పెట్టించెను. ఆ చద్రాక్కర్ మును . . . వేసి నదుపంగలవారు నడుపంగలవారు నడపరైరేని గంగాతీరమున కవిల చంపినవారు [ఈ] స్దానము ఏలే
కరణాలు . . . . కాడున మేల్నాయుకులును పూజారులును ఎడవడపడకంచాను అఖండదీపానకు [నై]. . . .
మి కవిలం బొడ్బివారు శ్రీశ్రీశ్రీ | శ్రీ ఖ్యాతైతసువాయకసుతనయో మారాహ్వయో నయక -
శ్రీ మద్దొంక మహీపతి ప్రియ . . . . య్యర్ వంశాగ్రజః | . . నిత్యగుణా లోకన . . . . భూతాసుచేతసా
. . . రం సా బయయమాఖ్యా స్దుతా | తత్పుత్రీరుచిరం ప్రదీపమ . . . . . శ్రీభావనారాయణాయ . . . 0డయనాయక సుతప్రేయస్యఖండం . . . [శాకాబ్జే] నయనానలేశగణితే మేషేరవౌ
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . . . . . . . . . .
*. బాపట్ల మొట్టమొదటి పేరైన "ప్రేంపల్లి" అను ముఖమందప ప్రవేశ ద్వారానికి ఎడమ ప్రక్కన బయటివైపు పశ్చిమ దిక్కున ఉన్న శాసనాల్లో క్రిందనుంచి మొదటి వరుసలో 8వ శిలపై "శ్రీప్రేంపల్లి" అని, తూర్పు దిక్కున ఉన్న శాసనల్లో క్రింద నుంచి రెండవ వరుసలో 7వ శిల మీద "ప్రేంపల్లి" అని లిఖించబడివుంది.
*. "బ్రహ్మపల్లి" అనుపేరు ముఖమంటప ప్రవేశ ద్వారానికి కుడిప్రక్కన క్రిందనుంచి 3వ వరసలోని 2వ శిలపైన, ఆలయం చుట్టూ బయటివైపున పశ్చిమ దిక్కుగా ఉన్న శాసనాల్లో క్రిందినుంచి మొదటి వరసలో చివరి నుంచి 3వ శిలమీద స్పష్టంగా కనిపిస్తుంది.
*. "భావపట్ట" అను పేరు ఆలయం చుట్టూ బయటివైపున పశ్చిమ దిక్కుగా ఉన్న శాసనాల్లో క్రింద వరస నుంచి 2వ వరసలో 5వ శిల క్రింద లిఖించబడివుంది.
*. "భావపట్టు" అను పేరు ఆలయం చుట్టూ బయటివైపున తూర్పు దిక్కుగా ఉన్న శాసనాల్లో క్రింద నుంచి మొదటి వరుసలో 4వ శిలలోను మరియు మూడవ వరుసలోని 12వ శిలలోను గమనించవచ్చు.
*. "బాపట్ట" అను పేరును తూర్పు దిక్కున క్రిందనుంచి 5వ వరుసలో మొదటి శెలపై గమనించవఛ్చు.
* భావనారాయణ దేవర పెరుమాళగా స్వామి వారి పేరు ప్రతిష్టించబడిన శాసనము: ఈ శాసనాన్ని ముఖమంటపానికి కుడివైపున గల కుడ్యం మీద చూడవచ్చు.
*. కులోత్తుంగ చోళుని నామంతోగల శాసనము: పడమరదిక్కున క్రింద నుంచి 2వ వరుసలోని 9వ శిలలో గమనించవచ్చు కులోత్తుంగుడు వేయించిన అనేక ఇతర శాసనాలను గమనించవచ్చు.
*. భావనారాయణ దేవర కొప్వుసాని అను పేరుగల శాసనము: దీనినితూర్పు దిక్కున ఉన్న శాసనాల్లో క్రిందనుంచి రెండవ వరుసలో 11వ శిలపై గమనించవచ్చు. ఈ శాసనం క్రీ.శ. 1167 నాటిది
*. బిరుదు మాడల గురించి తెలిపే శాసనం: నాడు ధనం మాడల రూపంలో ఊండేదని తెలిపే ఈ శాసాన్ని తూర్పు దిక్కున ఉన శాసనాల్లో క్రింద నుంచి 3వ వరుసలో చివరి నుంచి 19వ శిలపై గమనించవచ్చు.
స్వస్తి శ్రీమతు నిడుంబ్రోలి కొట్టారు యేతమనాయకుని కొ . . . . . . . . . . సానిపురుషునితోంగూడ శెవలోకము చె . . . ఆ . . కు ధమ్ముర్ వు నాను మారినాయకుణ్ణు ప్రెంపల్లి భావనారాయ-
. . . దీపము పెట్టించెను శకవషర్ ంబులు 1132 నేంట్టి మేషవిషువునాండు శ్రీమన్మహామండలేశ్వర కులోత్తుంగ ప్రిధ్వీ[గొం]క మహారాజుల చెలియలు అక్కమమ మాదేవి కొడుకు చోడగొంక మహారాజు ప్రిధ్వీరాజ్యము సేయంగా . . ఇచిన [.........] ఎంభది ఈ ఎడ్లెంభయి [1] వీని గుండని సూరెబోయిని కొడ్కు ప్రోలెబో -
యుండు అతని కొడ్కు . . . . 0డు ఈ వంశము వారి వంశము వారి వంశమున అఖండదీ పావ . . . .వోయ సమప్పిర్ ంచి పెట్టించెను. ఆ చద్రాక్కర్ మును . . . వేసి నదుపంగలవారు నడుపంగలవారు నడపరైరేని గంగాతీరమున కవిల చంపినవారు [ఈ] స్దానము ఏలే
కరణాలు . . . . కాడున మేల్నాయుకులును పూజారులును ఎడవడపడకంచాను అఖండదీపానకు [నై]. . . .
మి కవిలం బొడ్బివారు శ్రీశ్రీశ్రీ | శ్రీ ఖ్యాతైతసువాయకసుతనయో మారాహ్వయో నయక -
శ్రీ మద్దొంక మహీపతి ప్రియ . . . . య్యర్ వంశాగ్రజః | . . నిత్యగుణా లోకన . . . . భూతాసుచేతసా
. . . రం సా బయయమాఖ్యా స్దుతా | తత్పుత్రీరుచిరం ప్రదీపమ . . . . . శ్రీభావనారాయణాయ . . . 0డయనాయక సుతప్రేయస్యఖండం . . . [శాకాబ్జే] నయనానలేశగణితే మేషేరవౌ
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . . . . . . . . . .
[శాసనములో కొంత భాగము శెధిలమవడంతో
పూర్తి వివరము లభించలేదు]
భర్త మరణానంతరం భార్య సతీసహగమనం చేసిన విషయాన్ని [పురుషునితోంగూడ శివలోకము చె . . .] ఈ శాసనం తెలుపుతున్నది. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం వారికి పుణ్యలోక ప్రాప్తి కొరకు వారు కుమారుడు దేవాలయానికి అఖండ దీపాన్ని దానం చేసిన ఈ శాసనంలో సతి గురించి కూడా దాత తెలియజేయడం ఈ శాసన విశేషం. ఈ శాసనాధారంగా నాడు సతీ సహగమనం అమలులో ఉన్నదని తెలుస్తున్నది. అద్యంత విలక్షణమైన ఈ శాసనం నాటి సాంఘిక పరిస్దితులకు అద్దం పడుతుంది. దేవాలయాలు సామాజిక చరిత్రలకు నిలయాలని కూడా ఇది ఋజువు చేస్తుంది.

నామ పరిణామం
"ప్రేంపల్లి", "బ్రహ్మపల్లి తీర్ధం", "రాజమాణికపురం,"భావపట్టన", "బాపట్టన", భావపట్టు", "బాపట్టు", "బాపట్ల", "బాపట్ల"
నామ వివరాలను తెలుపు శాసనాల చిరునామ:"ప్రేంపల్లి", "బ్రహ్మపల్లి తీర్ధం", "రాజమాణికపురం,"భావపట్టన", "బాపట్టన", భావపట్టు", "బాపట్టు", "బాపట్ల", "బాపట్ల"
బాపట్ల మొట్టమొదటి పేరు "ప్రేంపల్లి", దేవాలయంలోని క్రీ.శ. 1023 నాటి తొలి శాసనంలో ఈ పేరే లిఖించబడింది. 54 శాసనాల్లో ఊరు వివిధ పేర్లతో లిఖించబడినప్పటికీ 44 శాసనాల్లో మాత్రం "ప్రేంపల్లి" పేరే పేర్కొనబడింది. క్రీ.శ. 1046, క్రీ.శ. 1142 నాటి శాసనాల్లోనూ, క్రీ.శ. 1154లో కన్నమజాజు వేయించిన శాసనంలోను "రాజమాణికపురం" గా ఊరు పేర్కొనబడింది. ఐతే ఈ సాసనాలలో "రాజమాణికపురమైన ప్రేంపల్లి" గా [రాజమాణికపురం అలియాస్ ప్రేంపల్లి] పేర్కొనబడింది. అనంతరం ఊరు ఎన్ని నామంతరాలు చెందినా, వివిధ పేర్లతో పిలువబడినప్పటికీ క్రీ.శ.1318 వరకు కూడ ప్రేంపల్లి గా పిలువబడడం విశేషం. క్రీ.శ. 1318 నాటి శాసనంలోను, మరో శాసనంలోను "పొడువు`ఱేవుల ఆ పేరుతో పిలువబడివుండవచ్చు. ఇది తెలుగు శాసనమైనప్పట్టికీ ఈ శాసనంలో స్వామి వారు "భావనారాయణ పెరుమాళ" గా పేర్కొనబడడం ఈ శాసన విశేషం.
క్రీ.శ 1135, 1136 మరియు 1145 సం||ల నాటి శాసనాల్లో మాత్రం ఊరు పేరు "బ్రహ్మపల్లి తీర్ధం" గా కనిపిస్తుంది. తీర్ధం అంటే క్షేత్రం అనే అర్ధం తో ఈ శాసనం నాటి ఆలయ విశిష్టతను తెలియజేస్తుంది.
క్రీ.శ. 1136 నాటి శాసనంలో తొలిసారిగా భావపట్టన" అను పేరుతో ఒక శాసనం కనిపిస్తుండగా క్రీ.శ. 1071 మరియు 1149 నాటి శాసనాల్లో "భాపట్టన" గాను క్రీ.శ. 1160, 1282, 1286 మరియు 1291 సం||ల నాటి శాసనాల్లో "భావపట్టు" గాను పేర్కొనబడింది. క్రీ.శ. 1282, 1287 మరియు 1291 నాటి శాసనాల్లో "శ్రీభావపట్టు" గా పేర్కొబడింది. ఊరు శ్రీభావపట్టుగా పేర్కొనబడినట్టి చిట్టచివరి శాసనం క్రీ.శ.1291 సం|| నాటిది.
క్రీ.శ. 1291 నుండి 1518 సం||ల మధ్య అంతే ఈ 200 సంవత్సరాల కాలంలో "భవపట్టు" అను పేరు మొదట "బాపట్ట" గాను తరువార "బాపట్ల"గాను చివరకు "బాపట్ల" నామ రూపాంతరం చెందినట్లు తెలుస్తొంది. బాపట్ల అను పేరు 1518 సం|| వేయంచబడ్డ శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి శాసనంలో మాత్రమే తొలిసారిగా కనిపిస్తుంది. ఇదే ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన చిట్టచివరి శాసమం. బాపట్ల అను పేరుతో ఈ శాసనం ఏర్పడిన తరువాత ఇతర పేర్లు జనబాహుళ్యం నుంచి దూరమయ్యాయి. క్రీ.శ. 1023 నుండి 1518 వరకు ప్రేంపల్లితో మొదలుకొని వివిధ పేర్లతో పిలువబడి, 500 ఏళ్ళలో ఊరి పేరు బాపట్ల నామ రూపాంతరం చెందింది. చివరకు బాపట్ల పేరు శాశ్వతమయింది.

____________________________________________________________ అనేక నామ పరిణామాలనంతరం ఊరి పేరు బాపట్లగా స్దిరపడినప్పటికి, ఊరు ఆవిర్భవించిన నాటినుండి నేటికీ "భావపురి" అను పేరు బహుళ వాడుకలో ఉంది. కవులు కళకరులు నేటికి బాపట్లను భావపురిగానే అభివర్ణిస్తుంటారు. "భావపురి" అను ఈ పేరుతో ఒక్క శాసనం కూడా లేకపోయినప్పట్టికి జనసామాన్యంలో ఈ పేరు ఆత్యంత ప్రసిద్ది చెందడం విశేషం
_________________________________________________________________ *. బాపట్ల మొట్టమొదటి పేరైన "ప్రేంపల్లి" అను ముఖమందప ప్రవేశ ద్వారానికి ఎడమ ప్రక్కన బయటివైపు పశ్చిమ దిక్కున ఉన్న శాసనాల్లో క్రిందనుంచి మొదటి వరుసలో 8వ శిలపై "శ్రీప్రేంపల్లి" అని, తూర్పు దిక్కున ఉన్న శాసనల్లో క్రింద నుంచి రెండవ వరుసలో 7వ శిల మీద "ప్రేంపల్లి" అని లిఖించబడివుంది.
*. "బ్రహ్మపల్లి" అనుపేరు ముఖమంటప ప్రవేశ ద్వారానికి కుడిప్రక్కన క్రిందనుంచి 3వ వరసలోని 2వ శిలపైన, ఆలయం చుట్టూ బయటివైపున పశ్చిమ దిక్కుగా ఉన్న శాసనాల్లో క్రిందినుంచి మొదటి వరసలో చివరి నుంచి 3వ శిలమీద స్పష్టంగా కనిపిస్తుంది.
*. "భావపట్ట" అను పేరు ఆలయం చుట్టూ బయటివైపున పశ్చిమ దిక్కుగా ఉన్న శాసనాల్లో క్రింద వరస నుంచి 2వ వరసలో 5వ శిల క్రింద లిఖించబడివుంది.
*. "భావపట్టు" అను పేరు ఆలయం చుట్టూ బయటివైపున తూర్పు దిక్కుగా ఉన్న శాసనాల్లో క్రింద నుంచి మొదటి వరుసలో 4వ శిలలోను మరియు మూడవ వరుసలోని 12వ శిలలోను గమనించవచ్చు.
*. "బాపట్ట" అను పేరును తూర్పు దిక్కున క్రిందనుంచి 5వ వరుసలో మొదటి శెలపై గమనించవఛ్చు.
* భావనారాయణ దేవర పెరుమాళగా స్వామి వారి పేరు ప్రతిష్టించబడిన శాసనము: ఈ శాసనాన్ని ముఖమంటపానికి కుడివైపున గల కుడ్యం మీద చూడవచ్చు.
*. కులోత్తుంగ చోళుని నామంతోగల శాసనము: పడమరదిక్కున క్రింద నుంచి 2వ వరుసలోని 9వ శిలలో గమనించవచ్చు కులోత్తుంగుడు వేయించిన అనేక ఇతర శాసనాలను గమనించవచ్చు.
*. భావనారాయణ దేవర కొప్వుసాని అను పేరుగల శాసనము: దీనినితూర్పు దిక్కున ఉన్న శాసనాల్లో క్రిందనుంచి రెండవ వరుసలో 11వ శిలపై గమనించవచ్చు. ఈ శాసనం క్రీ.శ. 1167 నాటిది
*. బిరుదు మాడల గురించి తెలిపే శాసనం: నాడు ధనం మాడల రూపంలో ఊండేదని తెలిపే ఈ శాసాన్ని తూర్పు దిక్కున ఉన శాసనాల్లో క్రింద నుంచి 3వ వరుసలో చివరి నుంచి 19వ శిలపై గమనించవచ్చు.
తమిళ సంస్కృతితో అనుబంధం
చోళ నిర్మాణ శైలిలోను, శ్రీవైష్ణవ సంప్రదాయంలోని ఈ ఆలయం తమిళ సంస్కృతితో ముడిపడివుంది. క్రీ.శ. 1107 సం|| నాటి ఒక శాసనంలో "దేవకర్మి", "నట్టవ", "తిరుమాడపల్లి", "తిరుమయి గావల" వంటి అనేక తమిళ పదాలు ఉన్నాయి. ఈ శాసనంలోనే దాత అయిన ముదిగొండ చోడ భహ్మమారాయండు అను తమిళ నామము లిఖించబడివుంది. స్వామివారిని ఒక తమిళ శాసనము "భావనారాయణ పెరుమాళ్" గా పేర్కొనడం, ప్రధాన ఆలయాన్ని ఆవరించి క్రీ.శ. 1115 ప్రాంతంలో నిర్మించబడిన మండపాన్ని "తిరుచుట్టుమాల" గాను, వంటశాలను "తిరుమాడవల్లి" (1107 నాటి శాసనం) గా పేర్కొనడం, స్వామి వారి అభిషేకాన్ని "తిరుమజ్జన" గా పేత్కొనడం, "తిరువోయమొజి" అనే పూజ, మరియు ఇతర తమిళ ఆచారాలు పొందుపరచబడి ఉండడం ఇందుకు తార్కాణం.

తిరుమజ్జన తిరువాయమొజి
తిరుప్పావడ సేవలో స్వామి వారిని పంచామృతాలతో అభిషేకం చేసే పూజా కార్యక్రమం తిరుమంజనం. ఈ ఉత్సవం నాడు స్వామి వారికి నాభి వరకు అన్నపు రాశులు పోసి, ఆ ప్రసాదాన్ని భక్తులకు చేటలతో పంచేవారు. తిరుమంజన గురించి క్రీ.శ 1107 నాటి శాసనంలో తెలుపబడింది. ఈ సాననంలో తిరుమంజన వెల్లిమూర్తి భట్లు, స్తోత్రకేశవ భట్లు అని వారి గురించి ప్రస్తావించబడింది. వీరు దేవతల అభిషేకానికి, స్తోత్రాలు పఠించడానికి నియమింపబడినవారు. తిరుమంజనం చేసేటప్పుడు ఆలపించే పారాయణ మే తిరువాయమొజి. క్రీ.శ. 1173 నాటి శాసనంలో స్వామి వారికి తిరువామూరి ఎరిపోటిభట్లు అను మరొకరి గురించి వివరిస్తూతిరువాయమొజి అను తమిళ భక్తి గీతాలను ఆయన ఆలపించేవాడని తెలిపింది.
ఇతర అనుబంధ నిర్మాణాలు
ధ్వజ స్తంభాలు :
ఈ ఆలయ విశేషాలలో మొట్టమొదటిది ఇక్కడ రెండు ధ్వజ స్తంభాలు ప్రతిష్ఠింపబడడం, మహద్వారానికి ముఖమండపానికి మధ్య ప్రతిష్ఠించబడిన 7 మీటర్ల ఎత్తు గా కీర్తి ధ్వజ స్తంభం 1.52 మీ. ఎత్తుగలపీఠంపై ప్రతిష్ఠించబడింది. జీవ ధ్వజం చోళ మహారాజుచే ప్రతిష్ఠించబడినదికాగా కీర్తి ధ్వజాన్ని అమతావతికి చెందిన రాజా వాసిరెట్టి వెంకటాద్రి నాయుడు ((1761-1816) 1803 సం|| లో వైఖానస ఆగమరీత్యా నిర్మించారు. కొంత కాలానికి కీర్తి ధ్వజం జీర్ణం కావడంతో దానిని శ్రీయుత వట్లమన్నాటి వెంకన్న సోమయాజులు గారు 1855వ సం|| లో పునరుద్దరించారు.

జీవ ధ్వజమునకు 13-11-1922లో గొట్టుముక్క్ల అప్పన్న చౌదరి గాగి తోడుగు వేయించారు. జీవ ధ్వజానికి క్రింది భాగంలో గరుడ విగ్రహం, పార్శ్వభాగంలో పస్ఛిమాన వీఅరాంజనేయస్వామి, తూర్పున ఇక్ష్వాకుల కాలం నాటి 4 అడుగుల పొడవుగల పాలరాతి నాగస్తంభం, జీవ కేర్తి ధ్వజముల మధ్య ఓ పాలరాతి స్తూపం ఉండేవి. పాలరాతి నాగస్తంభం ప్రస్తుతం లేదు.
మహాద్వార గాలి గపురం :
పరమేశ్వరుని వైభవానికి చిహ్నాలే గాఇ గోపురాలు. మోటారు వాహన సౌకర్యాలు లేని పూర్వకాలంలో ప్రజలు సుదూర ప్రాంతాలనుండి ఎడ్ల బండ్లలోనో కాలి నడకనో ప్రయాణాలు, క్షేత్ర సందర్శనాలు చేసేవారు. వారికి దూరం నుంచే క్షేత గమ్యాన్ని తెలియజేసేందుకు, వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు దేవాలయాల ప్రవేశ ద్వారాల చెంత గోపురాలను ఎంతో ఎత్తుగా అనేక వాకిళ్ళతో నిర్మించేవారు. వాటిని చూసినంతనే యాత్రికులకు అప్పటివరకు ఉన్న ప్రయాణపు బడలిక మటుమాయమై దేవాలయానికి, లేదా ఆ ఊరికి దగ్గరకు చేరుతున్నామనే కొత్త ఉత్సాహం పుట్టేది. యాత్రికుల సౌకర్యార్ధం నిర్మించబడ్డ ఈ గోపురాలు భక్తులు ఎంత దూరంగా ఉన్నప్పటికీ అంత దూరానికీ భక్తి భావాన్ని మోసుకెళ్ళే ఆధ్యాత్మీక వాహనాలుగా ఉపయోగపడేవి. ఈ గోపురాలు ఈ విధంగా దిక్చూచీలుగా, భక్తి తత్త్వానికీ దోహదపడేవి. కాబట్టే పురాతన ఆలయాల పట్ల ఈ రోజుకీ ప్రజలకెంతో ఆసక్తి, అనురక్తి.
భావనారాయణ స్వామి దేవాలయ గాలి గోపురం 1850లో బాపట్ల తాలూకాకి మెజిస్ట్రేట్ గా వచిన యడవల్లి వెంకయ్య గారిచే నిర్మించబడింది. గాలిగోపురంతోపాటు వీరు ఒక స్త్రాన్ని, పూలతోటను నిర్మించారు. గోపురం ప్రవేశ ద్వారం 20 అడుగులు ఎత్తు, 15 అడుగులు వెడల్పుతో గోడ మందం 2 అడుగులుగా నిర్మించబడింది. ప్రవేశ ద్వారానికి ఇరువైపుల రెండు ఎతైన అరుగులు ఏర్పరచబడ్డయి. 4 ఆంతస్తుల నిర్మాణం గల ఈ గాలిగోపురం మొదటి అంతశ్తులో రెండు దశాబ్దాల క్రితం వరకు ఒక ఢంకా, పెద్ద ఘంట ఉండేవి. స్వామి వారికి నివేదన పెట్టేటప్పుడు మూడు పూటలా దానిని ఉపయోగించేవారు. చివరి అంతస్తు శిఖరాన 5 రాగి కలశాలు అమర్చబడ్డాయి. 1936లోని తుపానుకు ఈ గోపురం శిధిలమవడంతో దాన్ని పునర్నిర్మించారు. 1985లోని మే నేల 2డవ తేదీన గోపురాన్ని పునరుడ్డరించి, పాత ప్తిమల స్దానే క్రొత్త ప్రతిమలను ఏర్పటు చేసి సంప్రోక్షించారు. ప్రస్తుతం గాలిగోపురం మీద ఉన ప్రతిమలు 1985 నాటివే. వీటి పునరుడ్డరణను చేయించినవారు కోన ప్రభాకరరావు గారు.
ప్రాకారము :
1865 లో ఈ తాలూకాకు తహసీల్దారుగా వచ్చిన వింజమూరు వేంకటరావు పంతులుగారు దేవాలయ ప్రాకారములను కట్టించి, వాహనశాలను ఏర్పాటుచేసి ధ్వజస్తంభాలను పునరుద్దరించారు.
రధం ;
గాలిగోపురానికి బయట కుడివైపున స్వామివారిని ఊరేగించే రధం రధశాలలో ఉంది. ఈ రధం 18వ శతాబ్దంలో "మల్లేశలింగం" అను విస్వబ్రహ్మణ కళాకారుడిచే నిర్మించబడింది. గత 300 సంవత్సరాలుగా ఈ రధం తిరునాళ్ళ సందర్భంగ స్వమివారి ఊరేగింపుకు ఉపయోగించబడుతొంది.
బలిపీఠం :
గ్రామదోషాల నివారణ కోసం, గ్రామంలో ఎవరికీ క్షుద్ర బాధలు కలగకుండా ఉండడం కోసం బలిపీఠం ఆహారం పెడతారు. రెండు పూటల ఉదయం, సాయంత్రం ఆహారాన్ని అష్టదిక్కులందు పెడతారు. దీన్ని బలిహారణ అంటారు. ఈ ఆహారాన్ని క్షుద్ర దేవతలు గ్రహిస్తారనే విశ్వాసంతో ప్రతి దేవాలయంలోనూ ఈ కాకార్యక్రమాన్ని నిర్వహింస్తారు. శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్దానంలో ఒకప్పుడు ఎనిమిది దిక్కులందు ఎనిమిది బలిపీఠాలు ఉండేవి. ఏడు బలిపీఠాలు జీర్ణమవడంతో ప్రస్తుతం ఒక బలిపీఠం మాత్రమే ఉంది. 1మీ. ఎత్తు, మరియు 1మీ. వైశాల్యం కలిగిన ఈ బలిపీఠం మహాద్వార గాలిగోపురానికీ, కీర్తి ధ్వజస్తంభానికీ మధ్య నిలిచివుంది.
*. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే పడమటి దిక్కున కనిపించే ఇటుక రాతి బావి 1920 లో నాటి తహశీల్దారైన సాగరాల కసురోజి గారి భార్య సోనాబాయమ్మచే నిర్మించబడింది.
*. బాహ్మీలిపిలోని రెండు శాసనాలు జీవ ధ్వజం దగ్గర ఉండేవి. వాటిని పురావస్తు శాఖ వారు భద్రపరిచారు.
*. ఆంధ్రప్రదేశ్ లో వెలసిన పంచ భావనారాయణ క్షేత్రాలలో ఇది ఒకటి. బాపట్ల, పొన్నూరు క్షేత్రాలు గుంటూరు జిల్లాలో ఉండగా పట్టనం, సర్పవరం క్షేత్రాలు తూర్పుగోదావరి జిల్లాలోనూ భావదేవరపల్లి క్షేత్రం కృష్ణాజిల్లాలోను ఉన్నాయి.
*. ఈ ఆలయం 1970 లో కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ వారి సం రక్షణలోకి తీసుకోబదింది.
*. శైవులైన చోళులు ఈ వైష్ణవ ఆలయాన్ని నిర్మించడం ఓ చారిత్రక ఘట్టంగా పేర్కొనవచ్చు.
*. శ్రీ జ్వాలా నరసిం హ స్వామి వారి తీక్షణతకు కారంచేడు గ్రామం అగ్నికి ఆహుతి కావడంతో ఆ దోష నివారణకు శ్రీ శాంత కేశవ స్వామిని శ్రీ జ్వాలా నరసిం హ స్వామి అభిముఖముగా ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి కారంచేడుకు దోష నివారణ కలిగి ఆ గ్రామం సస్యశ్యామలమయింది.
ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మూల విరాట్టుకు వెనక భాగాన ప్రతిష్ఠించబడ్డ ఈ శేష భావనారాయణుడి విగ్రహం 1758 వరకు భావనారాయణ స్వామి వారి ఆలయంలోని గర్భాలయం వెనుకగల మత్స్యయంత్రం దిగువన గల దేవకోష్ఠం (గూడు)లో ఉండేది. ఫ్రెంచి వారి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో దానిని మరల 1759 లో పునరుద్దరించారు. ఈ విగ్రహాన్ని 1880లో ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో స్వామి వారి వెనుక భాగాన దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు.
మత్స్యయంత్రం :
గర్భాలయానికి వెనుకగల భద్రకోష్టానికి ఉపరి భాగానికి చేరువలో ఉంటుంది. స్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసే భక్తులు ఈ యంత్రాన్ని స్పృశించడం శుభకరమని భావిస్తారు. దశావతారాల్లో మొదటి అవతారం కాబట్టి నారాయణుడి తోలి అవతారాన్ని దర్శించుకోవడాం కోసం చోళ రాజు ఈ యంత్రాన్ని ప్రతిష్ఠించాడు.

*. శ్రీ రంగనాధ స్వామి వారి విగ్రహం పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం నిర్మిస్తున్న కాలంలో ప్రతిష్థించబడింది.
*. దేవాలయానికి ఈశాన్య దిక్కులో ఉన్న బావి చోళరాజుచే నిర్మించబడింది. 1400 ఏళ్ళ క్రితం ఆలయ నిర్మాణ సమయంలో నిర్మించబడిన ఈ బావి నేటికి కూడా వాడుకలో ఉండడంవిశేషం.
బ్రహొత్స వాలు :
ప్రతి ఏటా వైశాఖశుద్ద సప్తమి నుండి పౌర్ణమి వరకు స్వామివారి బ్రహ్మోత్స్వాలు 9 రోజులపాటు రధోత్స్వమైన మర్నాడు వరకు అంగరంగనైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్స వాలలో "పొన్నమాను" ఊరేగింపు ఒక ప్రర్యేక అకర్షణ. అర్చక స్వాములలో శ్రీమన్ నల్లూరివారు, శ్రీనివాసుల వారు, హృందావనం వారు, నారాయణం వారు, వినుదొండ వారి క్టుంబాలు భద్తిశ్రడ్ద్లతో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తూ జనహితం గూర్చుతునారు. 2009లో 1-5-2009 (శుక్రవారం) నుండి 16-5-2009 (శనివారం) వరకు ఈ బ్రహ్మోత్స్వలు అత్యంత వైభవంగా జరిగాయి. 1వ తేదీన తిరుమజ్జనోత్సవముతో ఈ ఉత్సవాలు ప్రరంభమయ్యాయి. 2న ధ్వజారొహణ ఉత్సవము , అదే రోజు రాత్రి హంస వాహనోత్సవము, 3న సిం హ వాహనోత్సవము, 4న హనుమంత వాహనోత్సవము 5న పొన్న వాహనోత్సవము, 6న శేష వాహనోత్సవము, 7న పొన్న వాహనోత్సవము , 8న జగన్మోహిని ఉత్సవము, గ్రామోత్సవము, నృసమ్హ జయంతి, ఎదురుకోల ఉత్సవము, 9న తెల్లవారుజామున 3 గం.లకు శ్రీసుందరవాల్లీ రాజ్యలక్ష్మీ భవదేవుల కళ్యాణ మహోత్సవము, గరుడ వాహనోత్సవము సాయంత్రం రధోత్సవము అత్యంత వైభవంగ నిర్వహించబడ్డాయి. కాగా 10న శ్రీ పేరం గరుడాచలం నాయుడు గారి తూర్పు సత్రంలో వసంతోత్సవము-చక్రతీర్ధం-అపభృధం స్నానం, రాత్రి 7 గంటలకు శిఖరం వారి వీధిలో దోపు ఉత్సవము, రాత్రి 10 గం.లకు ధ్వజావరోహణము నిర్వహించబడగా 11న ద్వాదశ ప్రదక్షిణలు, పర్యంక శయనము, 12, 13, 14, 15, తేదీలలో 11న ద్వాదశ ప్రదక్షిణలు, పర్యంక శయనము, 16 న పదహారు తోజుల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. బాపట్ల చుట్టుప్రక్క గ్రామాల ప్రజలు వేలాదిగా ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించి, అయన కృపకు పాత్రులయ్యారు.

శ్రీ భావనారాయణ స్వామి దేవాలయ ప్రస్తుత అస్తుల వివరాలు
మాగాణి భూమి 19 ఎకరాల 93 సెంట్లు కాగా వేటిలో ఎ.2.50 సెంట్లు కృష్ణా జిల్లాలోని పెనుమల్లి గ్రామంలోను, 1 ఎకరం (రధోత్సవ నిర్వహణ నిమిత్తం) ములుకుదురు లోను, 1 ఎకరం నందిరాజుతోటలోను, 50 సెంట్లు నందాయపాలెంలోను, మిగిలిన భూమి జమ్ములపాలెంలోను ఉన్నయి. 5 ఎకరాల 33 సెంట్ల మెట్ట భూమి రమణాయపాలెంలోను, ఎ.6.26 సెంట్లు ఖాళీ స్దలాలు మరుప్రోలువారిపాలెంలోను ఎ.5.38 ఎకరాల భూమి (భజంత్రీల నిర్వహణ నిమిత్తం) కొత్తపాలెం వద్ద ఉన్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లు రు. 15 లక్షలు కాగా ఆలయానికీ అనుబంధంగా 6 దుకాణాలు ఉన్నాయి. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి ఆలయ అభివృద్దికై 1 కోటి రూపాయలు నిధులు మంజూరువ్హేశారు. ఆ నిధులతో పురావస్తు శాఖ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టి ఆలయానికి నూతన శోభను తీసుకురానుంది.
చారిత్రక నిలయంగానే కాక మహిమాన్విత క్షేత్రంగా కూడా విలసిల్లుతున్న భావపురి క్షేత్రం తొలుత వివిధ పేర్లతో పిలువబడినా చివరకు బాపట్ల పేరుతో స్దిరపడి దర్శ్నీయ ప్రాంతంగా యాత్రికులను విశేషం గా ఆకర్షిస్తొంది. ఈ క్షేత్రదర్శనం ప్రతి ఒక్కరిలోనూ అనిర్వచనీయ ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. ఆయ ప్రాంగణంలో నిత్యం ప్రతిధ్వనించే భగవన్నామ స్మరణం అలౌకికానందాన్నిస్తుంది.మాగాణి భూమి 19 ఎకరాల 93 సెంట్లు కాగా వేటిలో ఎ.2.50 సెంట్లు కృష్ణా జిల్లాలోని పెనుమల్లి గ్రామంలోను, 1 ఎకరం (రధోత్సవ నిర్వహణ నిమిత్తం) ములుకుదురు లోను, 1 ఎకరం నందిరాజుతోటలోను, 50 సెంట్లు నందాయపాలెంలోను, మిగిలిన భూమి జమ్ములపాలెంలోను ఉన్నయి. 5 ఎకరాల 33 సెంట్ల మెట్ట భూమి రమణాయపాలెంలోను, ఎ.6.26 సెంట్లు ఖాళీ స్దలాలు మరుప్రోలువారిపాలెంలోను ఎ.5.38 ఎకరాల భూమి (భజంత్రీల నిర్వహణ నిమిత్తం) కొత్తపాలెం వద్ద ఉన్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లు రు. 15 లక్షలు కాగా ఆలయానికీ అనుబంధంగా 6 దుకాణాలు ఉన్నాయి. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి ఆలయ అభివృద్దికై 1 కోటి రూపాయలు నిధులు మంజూరువ్హేశారు. ఆ నిధులతో పురావస్తు శాఖ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టి ఆలయానికి నూతన శోభను తీసుకురానుంది.
Suryalanka Beach, Bapatla
Suryalanka Beach is located 9 km from Bapatla in Guntur District of Andhra Pradesh. It is located 50 km south of Guntur City. Also known as the Bapatla Beach, it draws a large number of visitors on weekends and holidays.Suryalanka Beach is situated at a distance of 9 kilometers from the town of Bapatla, in Guntur district. The natural beauty of the beach and its closeness to the town attracts tourists who often return to the calmness of the sea for the weekend. The shore of the beach is wide and spacious. The Suryalanka Beach overlooks the crystal blue waters of the Bay of Bengal. It’s the only nearest beach from Hyderabad in Andhra Pradesh and quite spoken about.it is continued from Chirala.
Accessibility
Suryalanka beach is 9 km from Bapatla railway station (Station Code: BPP) in Guntur district. Autos are available to Suryalanka from Bapatla. Bapatla Beach (Surya Lanka) is well connected by road and there are frequent buses from Guntur also.Thanks to Andhra Pradesh Tourism and Development Corporation, they have a Haritha Beach Resort set-up over there which is the only one available. If anyone is unlucky to get an accommodation which means they can still get a hotel or a lodge booked in Bapatla town and have to commute all the way to the beach for fun. APTDC has built-up 10 A.C. rooms with a restaurant and camp fire facility.
Clock Tower
The Clock Tower, one of the historic landmarks in the heart of Bapatla town, has been demolished as part of widening the Guntur Bapatla Chirala (GBC) road and the approach road to the new Railway-over-Bridge (RoB) being constructed at Jammulapalem railway gate.Personnel of the revenue, municipal and R&B departments demolished the tower, which was constructed in 1948 by the then gram panchayat. The Bapatla Municipality, one of the oldest civic bodies, was formed in 1952.
The then Finance Minister of Madras State, as it was called then, Bezawada Gopala Reddy, inaugurated the tower. The then president of the gram panchayat Chadalavada Subba Rao and vice-president M
With the demolition of the clock tower, the existing narrow GBC road will be widened to have easy access to the new RoB. The manned railway crossing has become a hindrance for regular commuters, as over 180 trains ply on the Howrah-Chennai railway line.
But in the year 2010 the clock tower is destructed for widenig the roads.
Agricultural College – Bapatla
Agricultural College, Bapatla was started on 11th July 1945 by the erstwhile Government of composite Madras State on the recommendations of the Post War Reconstruction Committee. It is the oldest among 12 Agricultural Colleges in Acharya N.G. Ranga Agricultural University (ANGRAU). It was started with the aim of imparting Agricultural education for under graduate students and to turn out the Agricultural Graduates to man various post war reconstruction schemes.
The College was affiliated to Andhra University on the recommendations of Late (Sir) C.R. Reddy, Leader, and Inspection Team to the College and was under the administrative control of the Directorate of Agriculture of erstwhile Madras State. Andhra Pradesh Agricultural University (APAU) was established June 12, 1964. Since then, the college expanded rapidly both academically and physically with the addition of postgraduate and doctoral programmers. Many infrastructure facilities were added in terms of buildings and equipment for improvising the academic status in Agricultural Education. The College celebrated its Silver Jubilee during 1970-71, Golden Jubilee during 1994-95 and Diamond Jubilee during 2006.Bapatla Engineering College
Bapatla Engineering College was established in the year 1981 with a total intake of 180 students in CE, ME & E.C.E branches. The college was initially affiliated to ANDHRA UNIVERSITY and later to Nagarjuna University from 1984 Onwards. An additional section with an intake of 60 was sanctioned for Mechanical Engineering branch in 1987.
From the year 1994, The College embarked on programs of expansion in terms of courses and intake, infrastructure and facilities. Presently the college offers “9 B.Tech Degree Courses” with an intake of 900. Additional 10% intake is through lateral admissions into second year. The college also offers 5 M.Tech Courses in Engineering, 5 P.G Courses in sciences and Masters in Computer Applications with a total intake of 330. From the academic year 2009-2010, the Polytechnic course is being offered in the second shift with an intake of 180.
With requisite infrastructure facilities and competent human resources, the college is one of the “Largest Institutions in the State of Andhra Pradesh “. The college is widely acclaimed for its meticulous planning, resource scheduling and Institutional management. It is against this back drop that the college has solicited appropriate accreditation for Civil, Computer Science, Electronics and Communications, Electrical and Electronics, Electronics and Instrumentation and Mechanical Engineering branches twice by AICTE-NBA and for subsequently started Chemical Engineering, Information Technology and Bio-Technology once.