Bapatla, once known as Bhavapuri, is one of the historical towns and mandals of Guntur District (Andhra Pradesh) located 40 miles south of Guntur City on the East Coast of India. Because of Bhavanarayana Swamy, this town is also called Bhavapuri. In the period of the mouryans, those who are called adi-andhras came to this location and constructed a town.
They were land cultivators.
The adi andhras lived only in the shore area between Kanyakumari and Kolkatta.
They constructed the Bhavanarayana temple. They are Lanlords.
Now 3000 acres were registersd in adi andhra succerors.

చారిత్రక బాపట్ల 


ఎన్నో వాస్తవాలను తనలో నిక్షిప్తం చేసుకున్న భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవటానికి కలహణుని (1127-1155) "రాజతరంగిణి" లో తప్ప సంస్కృతంలోగానీ, మరే ఇతర భాషలోగానీ చారిత్రక గ్రంధాలు లేవు. కలహణుడు ఆధ్రుడే ఇతడు క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందిన కాశ్మీరు రాజైన విజయ సిం హుని ఆస్దాన కవి.  శిలా శాసనాలు, స్దల పురాణాలు, నాణాల ఆధారంగా కొంత చరిత్ర తెలుస్తున్నప్పటికీ మొగలాయిల పరీఅలనా కాలంలో చరిత్రకు సంబంధించిన రచనలు చేయడం ఆరంభమయింది.వారి నుండి స్పూర్తిగా తీసుకున్న అనేక హిందూ చక్రవర్తులు తమ ఆస్దాన కవులచేత అనేక చారితక గ్రంధాలు వ్రాయించడం ప్రాతంభించారు.  అలా ఆరంభమైన చరిత్ర రచన నేటికీ కొనసాగుతూనే వుంది.  స్దల ప్రాణాలు, శాసనాలు, వాణాలు, గ్రంధాల ద్వారా చరిత్రను పరిశీలిస్తే కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం మొదటి ఆంధ్రుల రాజధాని. దాని పాలకుడు కాళ రాజు. ఈ కాళరాజుని మౌర్యరాజ్యాధిపతియైన మహాపద్మనందుడు ఓడించినట్లు తెలుస్తొంది. ఈ మహాపద్మనందుడు క్రీ.పూ. 4వ శతాబ్దికి చెందినవాడు.   కాగా భౌద్ద వాజ్ఞయంలో ఆంధ్రరాష్టము "అంధక రట్టము"గా పేర్కొనబడింది.   
  వివిధ శాసనాలు, సాణాలు మరియు వివిధ చారిత్రకంశాల ఆధారంగా బాపట్ల ప్రాంతం ఏ కాలంలో ఎవరి పరిపాలనలో ఉందో ఆ చరిత్రను పరిశేలిస్తే ..........
భావనారాయణ స్వామి వారి దేవాలయంలో గల శిలా శాసనాలు, బాపట్ల పరిసర ప్రాంతాల్లో లభించిన శాసనాలు, ఇతర చారిత్రక ఆంశాల ఆధారంగా బాపట్ల ప్రాంతపు చరిత్ర తెలుస్తున్నది.  ఆంధ్ర దేశ చరిత్రలో ప్రప్రధమంగా ఈ ప్రాంతమే మౌర్యుల పాలనా కాలంలో ప్రముఖ చారిత్రక ప్రదేశంగా ఆవిర్భవించినట్లు భట్టిప్రోలు మరియు అమరావతిలలో లభ్యమైన శాసనాలు, ప్రాచీన అవశేషాలనుబట్టి తెలుస్తున్నది. క్రీ.పూ. 273 ప్రాంతానికి చెందిన మౌర్య చక్రవర్తి అశోకుని శాసనాలు హైదరానాద్ లోని మాస్లిలోను, కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి, రాజులమందగిర్లలోను కానవచ్చాయి. అశోకుడు క్రీ.పూ.  232లో వేయించ్న 13వ శిలా శాసనంలో "ఆంధ్ర" తన అధీనంలో ఉందని తెలిపాడు.  అదేవిధంగా బౌద్దయుగం నాటి నుంచి నేటి వరకు ఆంధుల  రాజకేయ చరిత్రగతిని నిర్ణయించుటలో ప్రాకృత శాసనాల్లో పేర్కొనబడిన కమ్మ రాష్ట్రము అతి ముధ్యమైన అధారంగా వుంటుం న్నది.  ఈ ప్రాంతంలో లభ్యమైన శాసనాలనుట్టి బాపట్ల ప్రాంతం కులోత్తుంగ చోడ మండలంలోని ఉత్తమ చోడ వలనాడులోని కమ్మనాడులలో ఉన్నట్లు తెలుస్తొంది.  కమ్మకరాక లేక కర్మ రాష్ట్ర లేక కమ్మ విషయ అను నామంతరాలు కలిగిన కమ్మనాడు ప్రాచీన ఆంధ్రదేశ ప్రాదేశిక విభాగాలలోని ఒక ముఖ్యమైన  నాడు.  అనేక ప్రాకృత, సంస్కృత శాసనాలలో పేర్కొనబడిన ఈ ప్రాదేశెక విభాగం గురించి మొట్టమొదటగా క్రీ.శ. 240-260 కాలంలో పరిపాలించిన ఇక్ష్వాక రాజైన వీరపురుషదత్తు వీరపురుషదట్టు జారీచేసిన జగ్గయ్యపేట శాసనంలో పేర్కొనబడింది.గుంటూరు జిల్లాలోగల పూర్వపు నరసరావుపేట మరియు బాపట్ల తాలూకాలు, ప్రకాశం జిల్లాలోగల ఒంగోలు, కర్నూలు జిల్లాలోగల కొన్ని మార్కాపురం ప్ర్రాంతాలు కమ్మనాడులో చేరి ఉన్నవి.  గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చేరివున్న కమ్మనాడు, దీని చుట్టుప్రక్కలగల ఈ ప్ర్రాంతమే ఆంధ్రదేశ చరిత్రలో ప్రముఖమైన పాత్ర నిర్వహించింది.  
_______________________________________________________________________________________________
గులాం హుస్సేన్ తోట :-
శ్రీ భావనారాయణ స్వామి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా తాటాకులతో చలువ పందిళ్ళు వేస్తారు.  మామిడాకు తోరణాలతో అలంకరిస్తారు.  ఈ ఆకులు నాడు అలంఘీర్ తానీషా వద్ద తాబేదార్ గా పనిచేసే గులం హుస్సేన్ (1680సం||) నుంచి వచ్చేవి.  ఇతను దేవాలయానికి ఆ తోటను దానం చేశాడు.  గులాం హుస్సేన్ దానం చేసిన తోట కావున ఈ ప్రాంతం గులాం హుస్సేన్ తోటగా ప్రసిద్ది చెందింది.
_____________________________________________________________________________________________________________________________

 
 
      క్రీ.పూ. 4వ శతాబ్దికి చెందిన మెగస్తనీస్ అను గ్రీకు చరిత్రకారుడు ఆంధ్ర దేశం 30 బలిష్ఠమైన దుత్గాలు, 20 వేల పదాతిదళాలు, 2 వేల గుఱ్ఱాలు వెయ్యి ఏనుగులు, ఇతర బలాలతో శతృ  ర్భేద్యంగా అలరారుతుండేదని తన గ్రంధమైన "ఇండికా" లోతెలిపాడు.  మౌర్యుల తరువాత వేరు అత్యంత బలసంపన్నులని ఆయన ఆ గ్రంధంలో వివరించాడు.  మౌర్యుల పాలన అనంతరం ఈ ప్రాంతాన్ని శాతనాహనులు, ఇక్ష్వకులు తొలి పల్లపులు, ఆందగోత్రిజులు   మరియు విష్ణుకుండినులు పాలించారు.
శాతవాహన కాలమ్నాటి విద్దాంక నాణాలు పరిశీలించాక ఈ ప్రాంతం శాతవాహన రాజుల కాలమ్నుండి ఆంధ్రపదం (ఆంధ్రపదము అనే పేరు 3వ శతాబ్దిలోని పల్లవుల శాసనంలో లిఖించబడింది) లో ఓ ముఖ్య భాగంగా ఉండేదని స్పష్టమయింది.  క్రీ.పూ. (220) నుంచి క్రీ.శ. (230) వరకు 450 సంవత్సరాలపాటు పాలించిన శాతవాహనుల్లో క్రీ.శ. 78 నుండి 102 వరకు ఆధ్రదేశాన్ని పాలించిన గౌతమీపుత్ర శాతకత్ణి కాలం నుండి రాజ శాసనాలు నాణాలు మ ప్రాంతంలో విశేషంగా లభించడంతో వాటిద్వారా మన ప్రాంత చరిత్ర కొంతవరకు అవగతమవుతుంది. క్రీ. శ. 174-203ల మధ్య పాలించిన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో నాగార్జున కొండపై నివసెంచే ఆచార్య నాగార్జునుడు బౌద్దంలో మాధ్యమిక పద్దతిని ప్రవేశపెట్టి, "ప్రజ్ఞాపారమిత" వంటి పలు గ్రంధాలను రచించాడు.  ఈ గ్రంధాలు సిం హళము, చైనా వంటి అనేక దేశాల్లో సైతం విశేష ప్రాచుర్యాన్ని పొందాయి.  శాతవాహనుల తర్వాత రాజ్యాన్ని స్దాపించిన ఇక్ష్వాకులు (క్రీ.శ.200-254) విజయపురి (ప్రస్తుతమ్నాగార్జున సాగర్ వున్న ప్రాంతం) ని రాజధానిగా చేసుకుని పాలించారు.  ఈ ప్రాంతం ఇక్ష్వాకుల కాలం నాడు "కర్మ రాష్ర్టము"  అని, "కమ్మ కరాటము" అని పిలువబడేది. 5వ శతాబ్దానికి చెందిన చైనా యాత్రికుడు ఫాహియాన్ విజయపురి గురించి వర్ణించాడు. ఇక్కడ నిర్మించిన విహారాలను, శిల్పకళా వైభవాన్ని దర్శించడం కోసం కాశ్మీరు, గాంధార, చీనా, సిలోను, వంగ, ద్రావిడ దేశాలనుండి అనేకమంది బౌద్ద సన్యాసులు వచ్చేవారు.   ఇక్ష్వాకుల  కాలంలో రేపల్లె ప్రాంతాన్ని శాంతమూలుని బావమరిది పాలించేవాడు.  నాడు ఈ ప్రాంతాన్ని ధనక రాష్ర్టమనేవారు.   వీరి తర్వాత రాజ్యాధికారాన్ని యుద్దం ద్వారా చేజిక్కించుకున్న పల్లవులు క్రీ.శ. 630వరకు సమర్ధవంతంగా పాలించారు.  కృష్ణకు ఒడ్డునగల గుంటూరు జిల్లాలోని భాగం ఇక్ష్వాకుల తర్వాత బృహత్పలాయనుల రాజైన జయసిమ్హవర్మ (250-280) అధీనంలో ఉండేదనీ, తెనాలి రేపల్లె తాలూకాలు ఆయన అధీనంలోవేనని కొందరి అభిప్రాయం.  నేటి దివిసీమలోని కోడూరు వీరి ముఖ్య పట్టణం. తరువాత పాలనలోకి వచ్చిన శాలల్కాయనులులో రెండవ హస్తివర్మ పేరుగల శాసనము లభ్యమవడంతో వీరి గురించిన సమాబారం తెలుస్తొంది.  వీరు వేంగి రాజధానిగా పరిపాలించారు.  మట్టిపాడు,  చేజర్ల, గొంతంట్లలో లభించిన తామ్ర శాసనాలు ఆనంద గోత్రిజులు మ ప్రాంతాన్ని పాలించినట్లు తెలుపుతున్నాయి. వీరు చేజెర్లను రాజధానిగా చేసుకుని పాలించారు.  చేజెర్లలోని కపోతేశ్వరాలయాన్ని వీరు నిర్మించారు.  6,7 శతాబ్దాలలో విష్ణుకుండినుల ఏలుబడిలో బాపట్ల ప్రాంతం ఉండేది. వినుకొండ ప్రాంతం వీరి జన్మస్దలం.
క్రీ.శ. 7వ శతాబ్ది ప్రధమాత్ధం నుండి ఈ ప్రాంతంలో రూర్పుచాళుక్య పాలన ఒక బలీయమైన ప్రాంతీయ పాలనగా ప్రారంభమైంది.  కాని 9న శతాబ్ది నుండి తూర్పు చాళుక్య రాజ్యంపై పశ్చిమానగల రాష్ట్రకూటులు మరియు వారి అనంతరం పశ్చిమ చాళుక్యులు, ద్క్షిణానగల చోళుల దండయాత్రలు ప్రారంభమై ఎవరికి వారు తమ ప్రాబల్యాన్ని తూర్పు చాళుక్య రాజ్యంపై నెలకొల్పడానికి ప్రయత్నించడంతో తూర్పు చాళుక్య రాజ్యం అతలాకుతలమైంది. ఈ విధమైన పరిస్దితి క్రీ.శ. 12వ శతాబ్దిదాకా కొనసాగింది. ఇటువంటి పరిస్దితులో ఈ ప్రదేశంలోగల స్దానిక పాలనా కుటుంబాలు (రాజ వంశాలు) వారివారి స్వార్ధ ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాంతంపై అధిపత్యం కొనసాగిస్తూ పోరాడుతున్న రాజులకు సహాయ షకారాలు అందిస్తూ బలం పుంజుకోవడానికి దోహదం చేశాయి.  ఈ స్దానిక రాజవంశాలు వివిధ ప్రాంతాల్లో సర్వాధికారం చెలాయిస్తూ తమ స్త్వభౌమునకు నామమాత్రంగా విధేయయ చూపించారు
_____________________________________________________________________________________________
పీస్ పేటకు ఆ పేరు యలా వచింది? :-
జర్మనీకి చెందిన రెవ.జి.ఎన్.ధాంసన్ నార్మల్ స్కూల్లో 1904 నాటికి లోయర్ గ్రేడ్తోపాటు, హైయ్యర్ గ్రేడ్ శిక్షణా పాఠశాలను ఏర్పాటుచేశారు. దీనితో పాటు ఒక సాకేతిక వ్భాగాన్ని కూడా ప్రవేశపెట్టరు.  ఈ పాఠశాల ప్రాంతంలో తాటిచెట్లు ఎక్కువగా ఉండడం వలన ఆ చెట్లనుండి వచ్చేపేచుతో ఫైబరు ఫ్యాక్టరీ ఏర్పాటుచేసి అనేకమందికి ఉపాధి కల్పించారు ఇచట పీచుతో తాళ్ళు, బ్రష్ లు వగైరాలు చేసేవారు.  పీచుతో వస్తువులను తయారుచేసే ప్రాంతం కావడాంతో ఈ పేతను "పీచుపేట" గా వ్యవహరించేవారు.కాల క్రమేణా ఆ పేరు "పేస్ పేట" గా మారింది. నేటి పేడిసన్ పేటే నాటి పీస్ పేట
_____________________________________________________________________________________________________________________________

 
 
      స్దానిక రాజవంశాలు బలం పుంజుకుని అధికారం చెలాయిస్తున్న ఈ కాలంలోనే బాపట్ల ప్రాంతం ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. క్రీ.శ. 999 ప్రాంతంలో ఈ ప్రాంతంపై తంజావూరు చోళుల వత్తిడి ఎక్కువయింది. ఈ కాలంలో తంజావూరు పాలకుడైన మొదటి చోళ రాజరాజు తూర్పు చాళుక్యుల రాజ్యమైన వెంగి రాజ్యంలో నేలకొన్న అస్దిర పరిస్దితులను అవకాశంగా తీసుకొని ఈ ప్రాంతంపై తమ ప్రాభవాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించాడు.  వెంగిలో సిం హాసనాన్ని కోల్పోయిన శక్తివర్మ, విమలాదిత్యులకు సహాయం చేసి శక్తివర్మను వేంగి సిమ్హాసనంపై అధిష్టింపజేసి, విమాలాదిత్యునకు తన కుమార్తెనిచ్చి వివాహం చేసి వేంగి రాజ్యంపై తన ప్రాభవాన్ని నెలకొల్పాడు. నాటి నుండి వేంగి రాజ్యంతోబాటు దాని అంతర్భాగమైన బాపట్ల ప్రాంతంపై తంజావూరు చోళుల అధిపత్యం నేలకొల్పబడింది. పశ్చిమ చాళుక్యుల దాడుల నుండి వేంగి రాజ్యంలో నిలిపి, దానిపై తమ ప్రాభవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించారు. అదేవిధంగా పశ్చిమ చాళుక్యులు కూడా ఈ వేంగి రాజ్యంలో నిస్పృహ చెందిన తర్పు చాళుక్య సంతతికి చెందిన యువరాజుకు సహాయం అందిస్టూ తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నించారు. అందుచేత ఈ కాలంలో వెంగి రాజ్యం పశ్చిమ చాళుక్యుల, చోళుల మధ్య యుద్దభూమిగా మారింది. కాని క్రీ.శ. 1070లో తంజావూరు రాజైన అధిరాజెంద్రుడు వధించబడిన తరువాత చోళ సిం హాసనానికి వారసులు లేకపోవడం జరింగింది. ఆ సమయంలో చోళుల బంధువైన తూర్పు చాళుక్య రాజు రాజేంద్రుడు చోళ సిం హాసనాన్ని అధిష్టించవలసిందిగా ఆహ్వానింపబడ్డాడు. చాళుక్య రాజేంద్రుడు "కులోత్తుంగ" చోళ" (చోళ వారసుడు) అనే బిరుదుతో చోళ  అధిష్టించడాంతో ఈ ప్రాంత చరిత్ర నూఅతన అధ్యాయాన్ని సంతరించుకుంది.  వేంగి రాజ్యం చోళ రాజ్యంలో అంతర్భాగమైంది. ఈ సమయంలో అనేక మంది చోళ యువరాజులు, చోళ సైన్యాధిపతులు వేంగి ప్రాంత పాలనకై పంపబడ్డారు. ఇదే సమయంలో ఈ ప్రాంతంపై తమిళ ప్రభావం ప్రసరించడం ప్రారంభమైంది.  అంతేకాక కులోత్తుంగుడు అనుసరించిన విధాన ఫలితంగా ఈ ప్రాంతంలో తతరాలుగా తూర్పు  చాళుక్యులకు విధేయతతో మెలిగివుంటుమ్న్న అనేక పాలక వంశాల వారిని సామంత స్దాయికి పెంచి వారి సహాయసహకారాలు పొందాడు.
తూర్పు చాళుక్యులకు గనీ, చోళులకుగానీ సామంతులుగా ఉంటూ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సామంతాధీశుల పేర్లే భావనారాయణ స్వామి దేవాలయంలో గల శాసనాలలో చోటుచేసుకున్నాయి. భావనారాయణ స్వమి దేవాలయంలోగల తోట్టతోలి శాసనం (క్రీ.శ. 1023) లో చంగల్లు గ్రామాన్ని భావదేవరకు దానం చేసిన మహామండలేశ్వర పినమల్లి చోడ మహారాజు పేరు పేర్కొనబడింది.    
ఆయనకున్న బిరుదునామమునుబట్టి ఆయన కడప ప్రాంతంలో పాలన చేస్తున్న పొత్తపి చోళుల పాలకుడని తెల్యుచున్నది.  దీన్నిబట్టి బాపట్ల ప్రాంతం క్రీ.శ. 11వ సతాబ్దినాటికి పొత్తపి చోడుల పాలనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
పొత్తపి చోడుల నుండి ఈ ప్రాంతం కొణిదెన (నరసరావు పేట ప్రాంతం) రాజధానిగా పాలిస్తున్న కొణిదెన తెలుగు చోడుల పాలనలోకి వెళ్ళినట్లు తెలుస్తున్నది. కొణిదెన పాలకులైన కన్నరదేవచొడ మహారాజు (1115-1137), త్రిభువనమల్ల దేవ చోడ మహారాఉ (1137-1151) బాపట్ల భావదేవరకు ఇచిన దాన శాసనాల వలన ఈ విషయం ఋజువవుతున్నది. వీరి తర్వాత జైహయ వంశస్దుడైన రాజేంద్ర కోన లోక రాజు 1168 వరకు పరిపాలించాడు.
తదుపరి బాపట్ల ప్రాంతం క్రీ.శ. 1170 నుండి 1210 వరకు బాపట్ల 25 కి.మీ దూరంలో ఉన్న చండవోలు రాజధానిగ పాలించిన వేలనాటి చోడుల పాలనలోకి వచింది. భావనారాయణ స్వామి దేవాలయంలో ఈ వంశీకుల శాసనాలు 14 దాకా ఉండడం దేవాలయంతో వీరికిగల అనుబంధాన్ని తెలియజేస్తున్నది.  వీరి మొదటి శాసనం 1135లో వేయబడింది. వేలనాటి చోడ మహారాజులైన మొదటి చోడరాజు (1135-1137), కులోత్తుంగ చోడ గొంకరాజు (1137-1163), రాజేంద్రచోడ గొంకరజు (1163-1180) మొదలైన వారు భావదేవరకు   ధానాలు చేశారు.  స్వామి వారి దేవాలయానికి సంబంధించి 11 శాసనాల్లో కులోత్తుంగ చోడ గొంకరాజు ప్రస్తావన ఉంది.  1173లో రాజేంద్ర చోడ గొంకరాజు వేసిన శాసనమే వెలనాటి చోడులు దేవాలయంలో ప్రతిష్ఠించ్న చివరి శాసనము క్రీ.శ 1210లో వెలనాటి చోడరాజైన పృధ్వీశ్వర మహారాజు నెల్లూరు తెలుగు చోడులతో జరిగిన యుద్దంలో మరణించగా నెల్లూరు తెలుగు చోడులకు సహాయం చేసిన వరంగల్ పాలకుడు కాకతీయ గణపతిదేవుని (క్రీ.శ. 1199-1262) ఆధీనంలోకి ఈ ప్రాంతం తీసుకురాబడింది.  కాకతీయులు ఈ ప్రాంతాన్ని క్రీ.శ. 1323 వరకు పాలించగా కాకతీయులలో చివరివాడైన ప్రతాపరుద్రుడిని 1323లో ఉల్ గ్ ఖాన్ (ఢిల్లీ సుల్తానైన ఘియాసుద్దీన్ కుమారుడు) ఓడించడంతో ఈ ప్రాంతంతోపాటు మొత్తం దక్షిణ భారతదేశంపై ఢిల్లీ సుల్తానులు తమ అధిపత్యాన్ని నెలకొల్పుకున్నరు.  
ఐతే ముస్లింలు ఈ ప్రాంతాన్ని ఎక్కువ కాలం పరిపాలించలేకపోయారు. దక్షిణ భారతదేశంలో ముస్లింల పాలనకు వ్యతిరేకంగా వచ్చిన్న ప్రతిఘటనోద్యమాలలో భాగంగా ఈ ప్రాంతంలో క్రీ.శా. 1323 నాటికి రెడ్డి రాజ్యాన్ని ప్రోలయ వేమారెడ్డి స్దాపించగా బాపట్ల ప్రాంతం రెడ్డి రాజుల పాలనలోకి వచ్చిది. వరుసగా ఆరుగురు రెడ్డిరాఉలు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ రెడ్డి రాజులో 1386-1402ల మద్య పాలించిన కుమారగిరిరెడ్డి ఆస్దానంలోనే బాపట్లకు చెందిన లకుమ ఆస్దాన నాట్యనాయకిగా ఉండేది.
రెడ్డి రాజుల పాలనను 1448లో అంతమొందించి ఒరిస్సా గజపతులు ఈ ప్రాంతంలో తమ అధికారాన్ని నెలకొల్పారు. క్రమంగా విజయనగర పాలకుడైన శ్రీకృష్ణదేవరాయలు 1515లో గజపతుల పాలనను అంతమొందించగా ఈ ప్రాంతం విజయనగర రాజుల ఆక్రమణలోకి వచింది.  భావనారాయణ స్వామి దేవాలయంలో గల క్రీ.శ. 1518 నాటి శ్రీకృష్ణ దేవరాయల శాసనం ఈ ప్రాంతంపై విజయనఘర ఆధిపత్యాన్ని సూచిస్తున్నది.  తర్వాత అచ్యుతరాయలు (1530-42), ఆనంతరం సదాశివరాయలు, రామరాయలు, తిరుమలరాయలు, శ్రీరంగరాయలు 1579 వరకు పాలించారు.
1565లో రాక్ష్స-తంగడి యుద్దానంతరం కోస్తా ఆంధ్ర ప్రాంతం గోల్కొండ కుతుబ్ షాహిల (1512-1687) అధీనంలోకి వచింది.  గోల్కొండ సుల్తాన్ ఇభహీం కుతుబ్ షా 1579లో గుంటూరు జిల్లాను వశపరుచుకొన్నట్లు ఆధారాలున్నాయి. చిట్ట్చివరి సుల్తాను అబ్దుల్ హసన్ తానీషా కాలంలో తిమ్మభూపాలపురానికి "నిజాంపట్టణం" అనే పేరు మాత్చి బాపట్లను నిజాంపట్నం సర్కార్ లో చేర్చాడు.1687లో తానీషాను ఓడించి ఔరంగజేబుఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించడంతో ఈ ప్రాంతంలో 1724724 వరకు మెగలాయిల పాలన నెలకొల్పబడింది.  1724లో మొగలుల పాలన ప్రారంభించబడింది. అసఫ్ జాహీల పాలనలోనే నిజాం సలాబత్ జంగ్ 1751లో ఈ ప్రాంతంలో ఆంతర్భాగంగా ఉన్న ఉత్తర సర్కారులను ఫ్రెంచివార్కి ధారదత్తం చేశాడు.
దండుదారి :
దండు అంటే సైన్యం. ఇంగ్లండ్ కు చెందిన రాబర్డ్ క్లైవ్ 91725-1774) నాయకత్వంలో మద్రాసు నిండి కలకత్తా వరకు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సైనిక దళం నడిచిన దారే దండు దారి. సూర్యలంక తీరానికి చేరువలో ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గేట్ ఉన్న ప్రాంతం నుండి సముద్ర తీరం మీదుగా వారు దారి చేసుకుంటూ కలకత్తా చేరుకున్నారు. ఆ దారినే దండు దారి అనేవారు ఆ దారినే దండు దారి అనేవారు.  చినరంజాం నుంచి బందరు వరకు ఈ దారి చాలాకాలం ఉపయోగంలో ఉందేది. 1953 వరకు ఈ దారి జనబాహుళ్యంలో ఉంది.  
      తర్వాత నిజాముల్  ముల్క్ ఏలుబడిలో అబ్దుల్లా ఖాన్, ముక్తంజంగ్ కుంతి దురుఖాన్ వంటి ఆరుగురు సుల్తాన్లు నిజాంపత్నం సర్కార్కి ఆధికారులయ్యారు. తర్వాత నాసర్ జంగ్ ఈ సత్కార్లను ఫ్రెంచ్ వారికి విక్రయించాడు.  మూడవ కర్ణాటక యుద్దం (1758) లో ప్రించి వారిని ఇంగ్లీషు ఈస్ట్ ఇండియ కంపెనీ ఓడించగా నలాబత్ జంగ్ మచిలీ పట్టణం, కొండపల్లిలతో పాటు ఈ ప్రాంతాన్ని 1759లో ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడంతో బాపట్ల ప్రాంతంపై ఆంగ్లేయుల పాలన ప్రాంభమైంది.  దక్షిణ భారతదేశాన్ని క్రమంగా ఆక్రమించుకున్న బ్రిటిష్ వారు ఏటా కొంత శిస్తు చెలించే ఒప్ప్పందం మీద జమీందారులకు పాలనను అప్పగించారు.  సబ్త్ నవాబ్య్యద తన సోదరుదైన బసాలత్ జంగ్ కి మనోవర్తిజాగీరుగా గుంటూరును ఇచ్చాడు. ఐతే మైసూరు పాలకుడైన హైదర్ ఆలి గుంటూరును ఆక్రమించే ప్రామాదముందనే వంకతో నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నరైన సర్ ధామస్ రాంబాల్ట్ 1779లో గుంటూరును ఆక్ర మించాడు.  ఐతే బెంగల్ గవర్నర్ వార్న్ హేస్టింగ్స్ గుంతూరును తిరిగి బసాలత్ జంగ్ కి ఇప్పించాడు.  1782లో బసాలత్ జంగ్ మరణించిన తరువాత నిజాం ఆలీఖాన్ ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇవ్వ నిరాకరించాడు.  కాని లార్డ్ కార్న్ వాలిస్ బెంగాల్ గవర్నర్ జనర్ల్గ ప్రత్యేకంగా భారతదేశానికి రావడతో నిజాం ఆలీఖాన్ 1788 సెప్టెంబర్ 18న కెప్టెన్ కన్నెవేకు గుంటూరు సర్కార్ ను ఇవ్వవలసెవచ్చింది.
 
ఈవిధంగా క్రీ.శ. 1788 నాటికి గుంతూరు జిల్లాసంపూర్ణంగ ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచింది.  1794 వరకు బాపట్లతో గల గుంటూరు జిల్లా మచిలీపట్బం నుండి కంపెనీ సలహా సంఘం చేత పాలించబడింది. 1794లో కలెక్టర్ల పాలన ప్రవేశపెట్టబడడంతో గుంటూరు జిల్లా 14 తాలూకాలతో ప్రత్యేకంగా ఏర్పడగా బాపట్ల ఒక తాలూకాగా రూపొందించబడింది. అయితే పరిపాలనా సౌలభ్యం కొరకు గుంటూరు జిల్లా 1859లో కృష్ణా జిల్లాలో చేర్చబడి తుదిగా 1904 అక్టోబర్ 1వ తేదీన 9 తాలూకాలతో (తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పల్నాడు, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ, రెపల్లె, ఒంగోలు) ప్రత్యేకంగా గుంటూరు జిల్లాగా ఏర్ప్డింది.  ఐతే 1970 ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లా క్రొత్తగా ఏర్పడినప్పుడు బాపట్ల తాలూకాలోని కొంత భాగం ప్రకాశం జిల్లాకు మాత్చబడింది.  తర్వాత 1980, 1981, 1982లలో అనేక మార్పుల అనంతరం 19 తాలూకాలుగా గుంటుమ్రు జిల్లా ఏర్పడింది. 1985 మేలో ప్రవేశపెట్టబడిన మాడలిక వ్యవస్దననుసతించి పంచాయతీలస్దానే మండల వ్యవస్ద ఏర్పడ్డంతో బాపట్ల గుంటూరు జిల్లాలోని తెనాలి డివిజన్లో ఒక ఒక ప్రముఖ మండలంగా ఏర్పడింది.
పట్టణంలోని తోలి భవనము :
బాపట్ల పట్టణంలో తొలి భవనమును తిమ్మన కొండల రావు నాయుడు నిర్మించారు. 1850 ప్రాంతాల్లో ఈ భవనం జి.బి.సి. రోడ్డులో నిర్మించబడింది.  ఆరోజుల్లో ఈ భవనాన్ని చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామాలనుండి జనం బండ్లు కట్టుకుని మరీ వచేవారు. భవన నిర్మాతవైన కొండల రావు గారి పేర్ మీద ఆ వీధికి కొండలరావు వీధి అని పేరుపెట్టబడింది.  అన్నపూర్ణ  ధియేటర్ వద్దగ కృష్ణ మూర్తి నర్శింగ్ హోం ఎదురుగాగల ఈ భవనం నేటికీ చెక్కు చెదరకుండా నివాసయోగ్యంగా ఉండడం విశేషం. జి.బి.సి. రోడ్డులో బొలిశెట్టి వారి భవనము కూడా దాద్దాపు ఎదే కాలంలో నిర్మించబడింది. అయితే ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ మినహ మిగిలిన ఆంతస్తులు తొలగించబడ్డాయి. 
పడమర బాపట్ల  ప్రాంతంలో బయటపడిన క్రీశ్తు పూర్వం నాటి సమాధులు :
1982-84లో పడమర బాపట్ల ప్రాంతంలోని "నాదెళ్ళవారి దిబ్బ" (బేతని కాలనీ దగ్గర) ప్రాంతంలో ఇసుక కోసం నేలను త్రవ్వుతుండగా 8 అడుగుల లోతున ఒక ప్రాచీన శ్మశాన వాటిక బయటపడింది.  ఈ వాటికలోని సమాధులు శవ పేటికల రూపంలో ఉన్నాయి. బయటపడింది.  ఈ వాటికలోని సమాధులు శవ పేటికల రూపంలో ఉన్నాయి.  పేటిక 4 అడుగుల పొడువు 1 అడుగు వెడాల్పు, 1 అడుగు ఎత్తు పరిమాణంలో తొట్టిలాగా వుండి, అడుగున 8 కోళ్ళు కలిగివుంది. ఈ తొట్టి ఎర్రమట్టితో కాల్చి చేయబడివుంది. ఈ పేటికలలో మానవ కంకాళాలు, ఎముకలు ఉన్నాయి.   ఇవి ఎముకలను లోపల పెట్టి, పైన పెంకుతో కప్పి భూస్దాపితం చేసినట్లుగా కానవచ్చాయి. పుర్రె, ఎముకలు, చెదిరిపోయినప్పటికీ దంతాల వరుదలు చెక్కుచెదరకుండా వున్నాయి.  క్రింద, పైన, నాలుగు ప్రక్కల నాలుగు రాళ్ళు వుంచనడి చిన్న గదిలాగా ఈ నిర్మాణం ఉంది. ఇందులో కొన్ని ఎముకలు వుండడం వలన వీటిలో శవాలు వుంచేవారని తెలుస్తుంది. నీటితోపాటు కొన్ని మట్టి పాత్రలు కూడా ఈ శ్మశాన వాటికలో బయటపడ్డాయి.  ఎర్రమట్టి, పాత్రల్లో మూతతో సహా వున్నవికొన్ని, చట్టీలవలె వున్నవి, మంచి పనితనంతో చేయబడ్డవి కొన్ని దొరికాయి.  గులాబి రంగులో అతి నాజూకుగా పల్చగా వున్న ఒక మట్టి పాత్ర కూడా ఇక్కడ లభించింది.  ఇవి క్రీ.పూ. 7-14 శతాబ్దాల నాటివి.  వీటిని "రాక్ష్స గుళ్ళు" అని, "సమాధిగుళ్ళు" అని కూడా వ్యవహరిస్తారు. వీటిని ద్రావిడులు లేదా మెడిటేరియన్ జాతివారు నిర్మించినట్లు భావిస్తునారు. ఈ ద్రావిడులు దక్షిణాపధాన ఆర్యులు దాడి చేయకుండా ప్రతిఘటించడంతో వారిచేత రాక్షసులు అనిపించుకున్నారు.  వారికి సంబంధించిన సమాధులు   కావడంతో వీటికి రాక్షసగుళ్ళు అని పేరు వచింది. ఈ రాక్షసగుళ్ళ ఆధారంగా బాపట్ల అనే పేరుతో ఊరు ఏర్పడక ముందే ..... అంటే  సుమారు 2500 సంవత్సరాల క్రితమే ఇక్కడ జనవాసలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.   

CHAT BOX